Big Stories

Telangana : సమ్మర్ ఎఫెక్ట్.. విద్యుత్ వినియోగంలో ఆల్ టైమ్ రికార్డు..

Telangana : తెలంగాణలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. మార్చి నెల ప్రారంభం నుంచే డిమాండ్ ఎక్కువైంది. తాజాగా రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. గురువారం ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయ్యిందని అధికారులు ప్రకటించారు. మార్చి నెల ఆరంభం నుంచే రోజూ 15,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు అవుతోందని తెలిపారు. బుధవారం 14,422 మెగావాట్లు విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది.

- Advertisement -

వేసవి మొదలుకావడంతో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇళ్లలో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగిపోయింది. దీంతో గృహ విద్యుత్ కు భారీగా డిమాండ్ వచ్చింది. మరోవైపు వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం పెరిగింది. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో ఈ పరిస్థితి వచ్చింది. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగానికే 37 శాతం వాడుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏటా పెరుగుతున్నాయి. దీంతో పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ వినియోగం అధికమవుతోంది.

- Advertisement -

ఈ ఏడాది వేసవిలో రోజువారీగా 16 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్‌ రావు తెలిపారు. ఎంత డిమాండ్ వచ్చినా సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్చిలో రోజువారీగా 15,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతోందని ముందే అంచనావేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. రైతులకు, వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభాకర్‌ రావు స్పష్టంచేశారు.

ఎండలు ముదిరితే తెలంగాణలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో 15,497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News