Big Stories

Paper Boxes : పేపర్ బాక్సుల్లో ఫరెవర్ కెమికల్స్..

Paper Boxes

Paper Boxes : కెమికల్స్ అనేవి ఎక్కడ లేవు.? ఆ చోట లేవు, ఈ చోట లేవు అని చెప్పే పరిస్థితి లేదు. ప్రతీచోట కెమికల్స్ అనేవి మన కంటికి కనిపించకపోయినా.. ఏదో ఒక విధంగా మన జీవితాలపై ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఫరెవర్ కెమికల్స్ అనేవి ఎన్నోరకాలుగా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన పేపర్ మెటీరియల్స్ కూడా ఫరెవర్ కెమికల్స్‌కు కారణమవుతున్నాయని విషయం బయటపడింది.

- Advertisement -

మనం రోజూవారి ఉపయోగించే సౌకర్యవంతమైన వస్తువుల దగ్గర నుండి అత్యవసరమైన వస్తువుల వరకు అన్నింటిలో ఫరెవర్ కెమికల్స్ అనేవి నిక్షిప్తమయున్నాయి. ఇంతకు ముందు వరకు ఇవి ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువుల్లో కనిపించేవి. గతకొంతకాలంగా ప్లాస్టిక్ వినియోగం అనేది చాలావరకు తగ్గిపోయింది. చాలామంది స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని పోరాటాలు చేశారు. అందుకే వాటి స్థానంలో పేపర్ ప్లేట్స్, కప్స్, బాక్సులు అనేవి అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -

కెనడాలో ఫాస్ట్ ఫుడ్‌ను ప్యాక్ చేయడానికి ఎక్కువగా పేపర్ బాక్సులను ఉపయోగిస్తుంటారు. ఆ బాక్సుల్లో కూడా ఫరెవర్ కెమికల్స్ ఉన్నాయన్న షాకింగ్ విషయం తాజాగా బయటపడింది. మామూలుగా పేపర్ బాక్సులను వాతావరణానికి హాని కలిగించని వస్తువులుగా పరిగణిస్తుంటారు. అంతే కాకుండా వాటిపై కూడా అలాంటి ముద్రనే వేస్తారు. కానీ కెనడాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు 42 రకాల పేపర్ బాక్సులను, పేపర్‌తో తయారు చేసిన ఇతర వస్తువులను పరీక్షించి చూడగా.. ఇందులో ఫరెవర్ కెమికల్స్ బయటపడ్డాయి.

కెనడాలోని టోరంటోలో సింగిల్ యూస్ ప్లాస్టిక్‌కు బదులుగా ఈ పేపర్ బాక్సులు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. కానీ వాటిలో కూడా కెమికల్స్ ఉంటాయని తెలిసిన తర్వాత ప్రజలు షాక్ అవుతున్నారు. వీటిలో ఫరెవర్ కెమికల్స్ అయిన పీఎఫ్ఏలు ఉన్నాయని తేలింది. కొన్ని పేపర్ బ్యాగ్స్‌లో అయితే మనిషి ఆరోగ్యానికి హాని కలిగించేంత మోతాదులో పీఎఫ్ఏలు ఉన్నాయని తెలిసింది. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అనే ట్యాగ్‌తో బయట అమ్ముడవ్వడం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

పేపర్ బాక్సులలో పీఎఫ్ఏ ఉండడం వల్ల అది మనం తీసుకునే ఆహారంలోకి వెళ్లి నేరుగా ఆ ఫరెవర్ కెమికల్స్‌ను శరీరంలోకి పంపుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతే కాకుండా అందులోని ఆహారం తినేసి పడేసిన తర్వాత కూడా అవి తాగునీటిని, గాలిని కలుషితం చేస్తాయన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ చేసే అంత హానిని ఈ పేపర్ బాక్సులు కూడా చేస్తున్నాయని వారు నిర్ధారించారు. త్వరలోనే దీనికి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News