E-Paper
Advertisement

Medical Corruption: డిప్యూటీ డీఎంహెచ్‌వో మెడికల్ మాఫియా బట్టబయలు.. లైవ్‌లో దొరికిపోయిన డాక్టర్..?

Medical Corruption: డిప్యూటీ డీఎంహెచ్‌వో మెడికల్ మాఫియా బట్టబయలు.. లైవ్‌లో దొరికిపోయిన డాక్టర్..?

Medical Corruption: వైద్యారోగ్యశాఖలో జరుగుతున్న తంతూ
–డిప్యూటి డీఎంహెచ్​వో అధికారియై ప్రైవేట్​ ఆసుపత్రిలో సర్జరీ
–ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేస్తున్న వైనం
–ఆ అధికారి భాగోతం ఉన్నతాధికారులకు కనిపించడం లేదా
–రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖలో ఏమీ జరుగుతుంది
–చేతివాటలతో అక్రమాలను ప్రోత్సహిస్తున్నారా..?

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: పేద, మధ్య తరగతి కుటుంబాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ధైవంలా భావిస్తారు. కానీ ఆ పేదలను ఆసరాగా చేసుకోని కొంత మంది డిప్యూటీ డీఎంహెచ్​వోలు వ్యాపారంగా మల్చుకుంటున్నట్లు ప్రచారాలు సాగుతున్నాయి. ఈ వ్యాపారాలు కూడా మారుమూల ప్రజలను లక్ష్యంగా చేసుకోని కొత్త కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్ధానిక ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయాలపై ఎందుకు స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగంగానే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్​ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నప్పుడు చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అర్ధం కావడం లేదు. చికిత్స కోసం వచ్చే మహళా గర్బిణీలను ప్రైవేట్​ ఆసుపత్రులకు ప్రభుత్వ వైద్యాధికారులే పంపిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాలు నిజం కాకపోతే ఆ అధికారికి ఓ ప్రవైట్ ఆసుపత్రిలో పనిచేయాల్సిన అవసరం ఏముందని స్ధానికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రైవేట్​ ఆసుపత్రిలో సర్జరీ..

డిప్యూటీ డీఎంహెచ్​వో పై భారీ ఎత్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.షాబాద్​ లో రెగ్యూలర్​ ఉద్యోగి.. అక్కడ పనిచేయడంతో ఆ వైద్యురాలికి వ్యాపారం కొనసాగదనే ఉద్దేశ్యంతో కొందుర్గు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా డిప్యూటేషన్​ పై వచ్చారు. దీంతో షాధ్​నగర్​ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్యచికిత్సలయ సామ్రాజ్యం సులభంగా ముందుకు సాగుతుంది. మూడు పువ్వులు ఆరుకాయాలుగా కొనసాగుతుందని స్ధానికులు బాగా చర్చించుకుంటున్నారు. షాద్​నగర్​ డివిజన్​లో ఈ తంతు నడుస్తున్నట్లు తెలుస్తోంది. భర్త పేరుతో షాద్​నగర్​ పట్టణంలో ప్రైవేట్​ ఆసుపత్రులు నెలకోల్పి ప్రభుత్వం ఆసుపత్రులకు వచ్చే రోగులను పంపిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం గానీ, సర్జరీల కోసంగానీ, ఇతరత్ర సమస్యల పరిష్కారానికి వచ్చే రోగులను పంపించి ఆర్ధికంగా బలపడుతున్నారు. అదే ప్రభుత్వం ఇచ్చే వేతనంతో విధులు నిర్వర్తిస్తూ ప్రవైట్​ ఆసుపత్రులకు ఊడిగం చేయడం ఏమీటని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అయినప్పటికి కొద్దీగా కూడా జంకకుండా అదే పనిగా చేస్తున్నాప్పటికి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. మంగళవారం విజయ ఆసుపత్రిలో మధ్​యాహ్నం 3గంటల 30 నిమిషాల సమయంలో ఒక సర్జరీ చేయడం విశేషం. ప్రతి రోజు ఇదే ఆసుపత్రిలో కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విధులకు హాజరుకానప్పుడు కార్యాలయంలో పనిచేసే స్టాఫ్​ నర్సును సంతకాలు చేయమని చెప్పడంతో వినని పక్షంలో బదిలీపై బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేసిన సంఘటనలున్నాయి. ఇదంతా తెలిసిన తెలియనట్లు ఉన్నతాధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also read: Illegal Mining: పోలీసు వాహనంపై ట్రాక్టర్‌తో దాడి కలకలం.. అడ్డొస్తే చంపేస్తారా..?

అంతా ముడుపులతో మౌనం..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆసుపత్రులను బలోపేతం చేయాలని ఆలోచిస్తుంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కూడా గర్బిణి మహిళాలకు సాధరణ డెలవరీలు జరిగేందుకు అత్యుధినిక వసతులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే స్ధాయిలో పనిచేయాలని ఆదేశాలు ఇస్తున్నప్పటికి పట్టింపు లేకపోవడం దారుణం. ప్రభుత్వం ఇచ్చే వేతనాలు తీసుకుంటూ పూర్తి న్యాయం చేయకుండా ప్రైవేట్​ వ్యవస్థకు కొమ్ముకాయడమంటే ఆత్మాభిమానం చంపుకోవడమే. ఇలాంటి వైద్యులు వృత్తిలో ఉన్నంత కాలం వైద్య వ్యవస్థకు కలంకంగానే మారుతుంది. ఉన్నతాధికారులు, ప్రశ్నించి నేతలను చేతివాటలతో మౌనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఎంత మంది కండ్లు కప్పి ప్రైవేట్​ వైద్యం అందిస్తారనేది ప్రశ్న. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆ డిప్యూటి వైద్యాధికారిపై చట్టరిత్య విచారణ చేపట్టి నిజనిజాలు బహిర్గతం చేసి చర్యలు తీసుకోవాలని స్ధానికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాల్లో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి.

Also read: Oil Reserves In India: షాకింగ్ న్యూస్.. ఆయిల్ సంక్షోభం మొదలైంది.. 10 రోజులకు మాత్రమే నిల్వలు

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×