BigTV English

Ambedkar Statue: స్ఫూర్తి-మూర్తి.. వేడుకగా అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ..

Ambedkar Statue: స్ఫూర్తి-మూర్తి.. వేడుకగా అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ..
ambedkar statue hyderabad

Ambedkar Statue Hyderabad(Telangana News): హుస్సేన్ సాగర్ తీరాన భారతజాతి నిండు గౌరవం నిలువెత్తు విగ్రహమై కొలువుదీరింది. సమున్నత మూర్తి.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కృతమైంది. అంబేడ్కర్ మనువడు ప్రశాశ్ సమక్షంలో.. సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. హెలికాప్టర్‌ ద్వారా విగ్రహంపై పూల వర్షం కురిపించి వేడుక చేశారు.


అంతకుముందు, అంబేడ్కర్‌ విగ్రహ రూపకల్పనపై రూపొందించిన డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్‌, ప్రకాశ్‌ అంబేడ్కర్‌ తదితరులు తిలకించారు. అంబేడ్కర్‌ జీవిత విశేషాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా వీక్షించారు. విగ్రహావిష్కరణకు ముందు బౌద్ధ గురువులు ప్రార్థనలు చేశారు.అనంతరం బహిరంగ సభ వేదికగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అంబేద్కర్ విగ్రహం విశేశాలివే..


–హైదరాబాద్‌లో దేశంలోకే ఎత్తైన అంబేడ్కర్ కాంస్య విగ్రహం
–హుస్సేన్‌సాగర్ తీరాన 11.80 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మారకం
–పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం
–పీఠంపై 125 అడుగుల పొడువు, 45 అడుగుల వెడల్పు, 465 టన్నుల బరువున్న అంబేడ్కర్ విగ్రహం
–పీఠం లోపల మ్యూజియం, గ్యాలరీ, ఆడియో విజువల్‌ రూమ్
–విగ్రహ ఏర్పాటుకు రూ.146.50 కోట్ల ఖర్చు
–విగ్రహ తయారీకి 360 మెట్రిక్‌ టన్నుల ఉక్కు
–114 టన్నుల లోహంతో విగ్రహం
–విగ్రహం చుట్టూ 2.93 ఎకరాల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌, గ్రీనరీ
–అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి- ‘రామ్ వి సుతార్’

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×