E-Paper
Advertisement

Amit Shah : ముస్లిం రిజరేషన్ల రద్దు.. ఎస్సీ, ఎస్టీలకు పెంపు.. అమిత్ షా సంచలన ప్రకటన..

Amit Shah : ముస్లిం రిజరేషన్ల రద్దు.. ఎస్సీ, ఎస్టీలకు పెంపు.. అమిత్ షా సంచలన ప్రకటన..
Advertisement
Amit Shah

Amit Shah : తెలంగాణలో బీజేపీ కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. కోరుట్లలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి ఈ రాష్ట్రంలో చాలా అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ముస్లింలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఆ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. బీజేపీ సర్కార్ అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తామన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలేనని అమిత్ షా విమర్శించారు. ఓవైసీ భయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలేదన్నారు. కాళేశ్వరం స్కామ్ చేసిన వారిని జైలు ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించారు.

Advertisement

అంతకుముందు జనగామ బహిరంగ సభలోనూ అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రజలు గెలిపించాలని కోరారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కృషి వల్ల రజాకార్ల నుంచి హైదరాబాద్‌ రాష్ట్రానికి విముక్తి లభించిందన్నారు. ఒవైసీకి భయపడి సీఎం కేసీఆర్‌ విమోచన దినోత్సవాలు జరపడం లేదని.. బీజేపీ సర్కార్ రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం కుటుంబ పార్టీలని.. బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీని స్పష్టంచేశారు. మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నారు. మోదీ కొత్త పార్లమెంట్‌ నిర్మించి దేశం గర్వించేలా చేశారని వివరించారు.

Advertisement

.

.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×