BigTV English

Amoy Kumar: అమోయ్ కుమార్ మెడకు మరో ఉచ్చు.. రూ.20వేల కోట్ల భూ దోపిడీ.. ఈడీకి ఫిర్యాదు చేసిన భాదితులు

Amoy Kumar: అమోయ్ కుమార్ మెడకు మరో ఉచ్చు.. రూ.20వేల కోట్ల భూ దోపిడీ.. ఈడీకి ఫిర్యాదు చేసిన భాదితులు

– అమోయ్ కుమార్ మెడకు మరో ఉచ్చు
– రూ.20వేల కోట్ల భూ దోపిడీ చేశారంటున్న శంకర్ హిల్స్ ప్లాట్ పర్చేస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
– ఈడీకి ఫిర్యాదు.. న్యాయం చేయాలని వేడుకోలు
– 460 ఎకరాల 6గుంటల భూమిని కొట్టేసిన కేటుగాళ్లు
– ఫినిక్స్‌కు అప్పనంగా అప్పజెప్పిన అమోయ్


హైదరాబాద్, స్వేచ్ఛ: Amoy Kumar: రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు వరుసగా బయటకొస్తున్నారు. ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు ఫిర్యాదు చేయగా, తాజాగా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఈడీని కలిసింది. రూ.20 వేల కోట్ల భూమిని దోపిడీ చేశారని శంకర్ హిల్స్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్‌ 111 నుంచి 179లో 460 ఎకరాల 6 గుంటల ల్యాండ్‌లో భారీ కుంభంణం జరిగిన్నట్లు ఈడీకి ఫిర్యాదు చేశారు.

ధరణి మాటున దగా
గతంలో శంకర్ హిల్స్‌ ప్లాట్ పర్చేసర్స్‌ వెల్ఫేర్ అసోసియేషన్‌ 460 ఎకరాలు భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిని 3 వేల 328 ప్లాట్స్‌గా మార్చి విక్రయించింది. అయితే, అమోయ్ కుమార్ మాత్రం కొనుగోలు చేసిన ఓనర్ల పేర్లను ధరణిలో నమోదు చేయలేదు. తిరిగి రైతుల పేర్ల మీదకే మార్చి, తర్వాత ఫినిక్స్‌ సంస్థకు అప్పగించారు. దీంతో 3 వేల 328 మంది దాకా ప్లాట్‌ ఓనర్లు రోడ్డున పడ్డామంటున్నారు. ఈ ల్యాండ్‌ విలువ 20 వేల కోట్లపైనే మార్కెట్‌ విలువ ఉంటుంది. ఆ భూమిని అమోయ్ అక్రమార్కులకు కట్టబెట్టాడని ఆరోపిస్తున్నారు.


Also Read: Cargo Parcel Service Hyd: టీఎస్ఆర్టీసీ కొత్త సేవలు.. ఇంటి వద్దకే పార్శిల్ సర్వీస్‌లు.. ఇక అక్కడికి వెళ్లక్కర్లేదు, జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు

ఇప్పటికే మధురానగర్ అసోసియేషన్ ఫిర్యాదు
అమోయ్‌ కుమార్‌ అరాచకాలపై ఈడీకి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని మధురానగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ బాధితులు ఫిర్యాదు చేశారు. అమోయ్‌ కుమార్‌ ధరణిని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. 200 ఎకరాలకు అక్రమ రిజిస్టేషన్లు చేశారని వాపోయారు. తమ ప్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదు చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్‌ ఉన్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు రిజిస్ట్రేషన్‌, రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారు అని వాపోతున్నారు బాధితులు. ఇదే సమయంలో శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేయడంతో అమోయ్ సాగించిన లీలలు ఇంకెన్ని ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×