BigTV English

Balakrishna: తండ్రి అడుగుజాడల్లో బాలయ్య.. సక్సెస్ అయ్యేనా..?

Balakrishna: తండ్రి అడుగుజాడల్లో బాలయ్య.. సక్సెస్ అయ్యేనా..?

నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయ రంగంలో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.దీనికి తోడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 4వ సీజన్ కూడా మొదలయింది. ఇకపోతే అన్ని రంగాలలో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇటీవల యాడ్స్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు స్టూడియో రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.


తెలంగాణలో స్టూడియో నిర్మించే ఆలోచనలో బాలయ్య..

తాజాగా నటసింహ నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు తన ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఆమోద ముద్ర వేసి ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సంబంధిత వర్గాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అన్నపూర్ణ స్టూడియోస్ కోసం భూములు పొందిన విషయం తెలిసిందే ఈ స్టూడియో 1976లో ప్రారంభమైంది.


సీనియర్ ఎన్టీఆర్ నిర్మించిన రామకృష్ణ సినీ స్టూడియో..

అదే సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఆర్టీసీ ఎక్స్ రోడ్ సమీపంలో రామకృష్ణ సినీ స్టూడియో నిర్మించి దానవీరశూరకర్ణ షూటింగ్ తో ఈ స్టూడియోను ప్రారంభించారు. ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవ వేడుకకు తమిళ లెజెండ్ యాక్టర్ ఎంజీఆర్ (MGR) కూడా హాజరయ్యారు. ఇక అంత పాపులారిటీ సంపాదించుకోవడం జరిగింది. ఇకపోతే కొంతకాలం తర్వాత నెమ్మదిగా ఈ ప్రాంతం కాస్త వాణిజ్య కేంద్రంగా మారింది. స్టూడియో నిర్మించే సమయంలో.. అప్పుడు అది కేవలం చిన్నది మాత్రమే. అయితే అక్కడ భూమి ఎక్కువ అందుబాటులో లేకపోవడం వల్లే స్టూడియోని విస్తరించడానికి సాధ్యపడలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ నాచారంలో ఒక పెద్ద స్టూడియోని నిర్మించారు. దీనికి రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియో అని కూడా పేరు పెట్టారు.

తండ్రి అడుగుజాడల్లో బాలయ్య..

ముఖ్యంగా ఇక్కడ పౌరాణిక సినిమాల షూటింగ్ కి అనువుగా శాశ్వత శక్తులు కూడా ఉన్నాయి.. ఇక ఇందులోనే ఎన్టీఆర్ (NTR ), బాలకృష్ణ (Balakrishna) సినిమా షూటింగులు మాత్రమే జరిగేవి. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ స్టూడియో కాస్త ఆయన సభా వేదికగా మారిపోయింది. 2000 వ సంవత్సరం తర్వాత స్టూడియోలో అక్కడ ఏ సినిమా షూటింగ్ కూడా జరగకపోవడం గమనార్హం. అయితే ఇప్పుడు దీనిని నిర్మించే ప్రయత్నం చేయకుండా ఆయన ఇంకో కొత్త స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తండ్రి అడుగుజాడల్లో బాలయ్య వెళ్తున్నారని సమాచారం.మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం బాలకృష్ణ స్టూడియో రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్ స్టూడియో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి బాలకృష్ణ ఆలోచనలో ఎలా ఉన్నాయో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×