BigTV English

Anchor Shyamala – Betting Apps Case: పోలీస్ విచారణ సందర్భంగా జగన్ పరువు కాపాడిన శ్యామల..!

Anchor Shyamala – Betting Apps Case: పోలీస్ విచారణ సందర్భంగా జగన్ పరువు కాపాడిన శ్యామల..!

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారిని తెలంగాణ పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. ఒక్కొక్కరే వెళ్తున్నారు, తమకు తెలిసిన సమాచారం చెప్తున్నారు. కానీ వీరంతా ముసుగులేసుకుని, మాస్క్ లేసుకుని మీడియాకి మొహం చాటేస్తున్నారు. మీడియా కంటపడేందుకు కూడా భయపడుతున్నారు. కానీ యాంకర్ శ్యామల మాత్రం కాస్త ధైర్యం చేశారు. ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నానన్న ఆలోచనతోనేమో ఆమె మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. మీడియాని చూసి పారిపోలేదు, అలాగని మాస్క్ లేవీ పెట్టుకుని తన ఐడెంటిటీని దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే పోలీస్ విచారణపై ఇప్పుడేమీ చెప్పలేనంటూ ఆమె తెలివిగా మాట్లాడి తప్పించుకున్నారు.



అది తప్పే..
బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల ఒప్పుకోవడం విశేషం. డెఫ్నెట్ గా ఇది తప్పు అని ఆమె అన్నారు. అయితే నష్టపోయిన కుటుంబాలకు ఆ లోటు తీర్చలేనిదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉండగా, బెట్టింగ్ యాప్స్ గురించి తానేది మాట్లాడినా తప్పు అవుతుందని అన్నారు శ్యామల. ఇక నిందితుల్ని పట్టుకోవడంలో తనవంతు పోలీసులకు సహకరిస్తానన్నారు. కేసు విచారణలో కూడా పోలీసులకు సహకరిస్తున్నానని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారామె.

టార్గెట్ వైసీపీ
శ్యామలపై కేసు పెట్టిన తర్వాత ఆమెకంటే ఎక్కువగా వైసీపీ టార్గెట్ అయింది. ఇలాంటి వారందరికీ జగన్ అధికార ప్రతినిధి పదవులిచ్చారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. బెట్టింగ్ వార్తలను కవర్ చేసే విషయంలో సాక్షి మీడియా తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిరోజులపాటు అసలు శ్యామల పేరే లేకుండా వార్తలిచ్చింది. ఆ తర్వాత ఆమె పేరు వాడినా, మిగతా వాళ్లపై పెట్టినంత ఫోకస్ ఆమెకు ఇవ్వలేదు. శ్యామల విషయంలో సేఫ్ గేమ్ ఆడాలని చూసింది సాక్షి. కానీ ఆమె ఎవరు, వైసీపీతో ఆమెకున్న సంబంధమేంటి, జగన్ దగ్గర ఆమెకున్న పలుకుబడి ఏంటి..? అనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై నమోదైన కేసుల విషయంలో వైసీపీ ఎక్కువగా ఇబ్బంది పడిందనే చెప్పాలి.

హైకోర్టులో పిటిషన్..
ఇక శ్యామల కేసు విషయానికొస్తే.. ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఒకసారి నోటీసులిచ్చారు. అయితే ఆమె ఆ నోటీసులకు స్పందించలేదు. విచారణకు హాజరుకాకుండా నేరుగా ఆమె హైకోర్టు తలుపు తట్టారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌ కూడా వేశారు. ఈ పిటిషన్‌ లను విచారించిన హైకోర్టు.. శ్యామలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమెను తొందరపడి అరెస్టు చేయవద్దని, నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులకు సూచించింది. ఈ నేపథ్యంలో తన న్యాయవాదితో కలసి యాంకర్ శ్యామల విచారణకు వచ్చారు.

మొత్తమ్మీద మిగతా వారిలాగా ముసుగు వేసుకుని రాకుండా శ్యామల కాస్త ధైర్యంగా రావడం విశేషం. అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పడంతో శ్యామలకు ఆ భయం లేకుండా పోయింది. అందుకే ఆమె మీడియాని కూడా ఫేస్ చేశారు. ఈ విషయంలో జగన్ పరువుని ఆమె కాస్తో కూస్తో కాపాడినట్టయింది. ఇక ఈ కేసు తర్వాత ఆమె వైసీపీ తరపున ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. ఆ పార్టీ కూడా ఇప్పుడప్పుడే శ్యామల సేవలు వినియోగించుకోవాలనుకోవట్లేదు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Big Stories

×