BigTV English

Teegala Krishna Reddy: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన తీగల కృష్ణా రెడ్డి

Teegala Krishna Reddy: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన తీగల కృష్ణా రెడ్డి

Thigala Krishna Reddy joined Congress


Teegala Krishna Reddy joined Congress: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణా రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ సమక్షంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా తీగల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటూ తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కృష్ణా రెడ్డి ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు పంపారు.


పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 60 ఏళ్ల పోరాటంతో సాధించుకున్న రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు అప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరినట్లు కృష్ణా రెడ్డి తెలిపారు. 2019లో  ఎమ్మెల్యేగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పనిచేశారని తెలిపారు.

Read More: ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. దరఖాస్తులకు గుడ్ న్యూస్..

గత కొంత కాలంగా పార్టీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తమ ప్రాంతానికి చేరడం లేదని కృష్ణా రెడ్డి అన్నారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న నిజమైన కార్యకర్తలకు పార్టీలో సరైన స్థానం లభించడం లేదని ఆరోపించారు.

“నా ప్రాంతానికి మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశ్యంతో, కార్యకర్తల మనోభావాలతో ఏకీభవిస్తాను. నేను బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ ఐదేళ్లుగా నాకు మద్దతుగా నిలిచిన పార్టీకి, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని కృష్ణా రెడ్డి తన రాజీనామాను ఆమోదించాలని పార్టీ అధినేతను డిమాండ్ చేశారు.

Tags

Related News

Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతవాసులు జాగ్రత్త..!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల

Nalgonda News: ఖరీదైన కార్లలో మేకలు, గొర్రెల దొంగతనం.. 16 మంది అరెస్ట్

Mehdipatnam accident: మెహదీపట్నం బస్టాప్‌లో RTC బస్సుకు మంటలు.. క్షణాల్లో బూడిద!

Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్

Mancherial Teacher: వెరైటీగా క్లాస్ కు వచ్చిన టీచర్.. విద్యార్థులు షాక్.. ఎక్కడంటే?

Big Stories

×