Big Stories

Pankaj Udhas: ప్రముఖ గాయకుడు పంకజ్ ఉధాస్ కన్నుమూత

Pankaj Udhas
Pankaj Udhas

Legendary Singer Pankaj Udha’s Death News: లెజెండరీ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. 72 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పంకజ్ కుమార్తె నయాబ్ ఉధాస్ ప్రకటించారు.ఆయన చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

చితి ఆయీ హై పాటతో ప్రపంచానికి వీడ్కోలు పలికారు. పంకజ్ ఉధాస్ 72 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. సోషల్ మీడియాలో అందరూ కన్నీటి పర్యంతమై గాయకుడికి చివరి నివాళులు అర్పిస్తున్నారు.

- Advertisement -

ఉదయం 11 గంటలకు బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో గాయకుడు పంకజ్ ఉధాస్ మరణించారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగా లేదు. మహాగాయకుడి మృతి వార్తతో సంగీత లోకంలో విషాదఛాయలు అలముకున్నాయి. పంకజ్ లాంటి గజల్ సింగర్‌ లోకాన్ని విడిచివెళ్లడం అభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. సోషల్ మీడియాలో అందరూ కన్నీటి పర్యంతమై గాయకుడికి నివాళులు అర్పిస్తున్నారు.

పంకజ్ ఉధాస్ మృతిపై ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. సింగర్, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్ షాక్ లో ఉన్నారు. పంకజ్ మరణం సంగీత ప్రపంచానికి పెద్ద లోటుగా పేర్కొన్నారు. ఆయన లోటు ఎవరూ పూడ్చలేరని తెలిపారు.

భారతీయ సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గానూ.. పంకజ్‌ ఉధాస్ ను ఎన్నో అవార్డు వరించాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

పంకజ్ ఉధాస్ గజల్‌ గాయకుడిగా ఎంతో పేరు సంపాదించారు. 1980లో ‘ఆహత్’ ఆల్బమ్‌ ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. ముకరర్, తర్రన్నమ్‌, మెహ్‌ఫిల్, నయాబ్ లాంటి ఆల్బమ్ కు ఆయన స్థాయిని పెంచాయి.

1970లో ‘తుమ్ హసీన్ ప్రధాన జవాన్‌’లో ‘మున్నేకి అమ్మా యేతో బాటా’ పాటతో సినీ కెరీర్ ప్రారంభించారు. ‘నామ్‌’లో పాడిన ‘చిట్టీ ఆయే హై’ సాంగ్ కు ఎంతో పేరు వచ్చింది. పంకజ్ ఉధాస్ నేపథ్య గాయకుడిగానూ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయన ఎన్నో మధురమైన పాటలను పాడారు. ఆయన పాడిన హిందీ సాంగ్స్ చిరస్థాయిగా నిలిచిపోయాయి. బాలీవుడ్ లో ఆయన పేరు మారుమోగింది.

లతా మంగేష్కర్ , పంకజ్ ఉధాస్  కలిసి పాడిన పాటలకు సంగీత ప్రియులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. గంగా జమున సరస్వతి, బాజీఘార్, దిల్ అష్నా హై, బేటా చిత్రాల్లో పాటలు ఆయనకు ఎంతో పేరుతెచ్చి పెట్టాయి.

పంకజ్‌ ఉధాస్ స్వరాష్ట్రం గుజరాత్. ఆయన జెట్ పూర్ లో పుట్టారు. కేశుభాయ్‌ ఉధాస్‌, జితూబెన్‌ దంపతుల ముగ్గురు సంతానంలో ఆఖరివాడు పంకజ్. ఆయన సోదరుడు మన్హర్ కూడా గాయకుడే. అతడు కూడా అనేక బాలీవుడ్ మూవీస్ లో సాంగ్స్ ఆలపించారు. ఆయన రెండో సోదరుడు నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు సంపాదించారు. చిన్నతనంలో వైద్యుడు కావాలని పంకజ్ కవాలనుకున్నారు. కానీ మ్యూజిక్ పై మక్కువ పెరిగింది. దీంతో గాయకుడిగా మారానని ఆయన గతంలో వెల్లడించారు. సోదరుల బాటలోనే పంకజ్ ప్రయాణం సాగింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News