BigTV English

South Central Railway: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే

South Central Railway: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే

South Central Railway:  ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. మొత్తం 21 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో 10 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లుగా పేర్కొంది. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌‌ను రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను భీమవరం మీదుగా దారి మళ్లించారు.


గడిచిన మూడురోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. దీంతో రవాణా అస్తవ్యస్తంగా మారింది. వర్షాలకు పలుచోట్ల రైల్వే ట్రాక్ దెబ్బ తిన్న నేపథ్యంలో 21 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. మరో 10 రైళ్లను దారి మళ్లించింది.

వర్షాల గురించి సమాచారం అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, సికింద్రాబాద్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి రైళ్ల కార్యకలాపాల పునరుద్ధరణ, ఇతర భద్రతా అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాక్స్ ఎక్కడైనా డ్యామేజ్ అయ్యాయా? అనే దానిపై దిగువస్థాయి సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తున్నారు.


ALSO READ: తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలు బంద్..ప్రయాణాలు మానుకోవాలని విజ్ణప్తి

తెలంగాణలోని కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ వద్ద కేసముద్రం రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఆ ప్రదేశంలో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాల ధాటికి రద్దయిన రైళ్ల జాబితాలో కాకినాడ- లింగంపల్లి, సికింద్రాబాద్-గూడూరు, బీదర్-మచిలిపట్నం, మచిలీపట్నం-బీదర్, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం- సికింద్రాబాద్, చెన్నై- న్యూఢిల్లీ, న్యూఢిల్లీ- చెన్నై వంటి రైళ్లు ఉన్నాయి.

దారి మళ్లించిన రైళ్ల జాబితాలో 10 రైళ్లు ఉన్నాయి. వాటిలో తిరుపతి- సికింద్రాబాద్, బెంగుళూరు-పాటలీపుత్ర, విశాఖపట్నం-న్యూఢిల్లీ, విశాఖ-ముంబై, బీదర్-మధురై వంటి రైళ్ల ఉన్నాయి. అదనపు సమాచారం కోసం రైల్వే విభాగం, హెల్ప్ లైన్ల నెంబర్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్-27781500, వరంగల్-2782751, కాజీపేట-27782660, ఖమ్మం-2782885 నెంబర్లను సంప్రదించవచ్చు.

మరోవైపు హైదరాబాద్-విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలుచోట్ల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ దాదాపు 500 బస్సులు రద్దు చేసినట్టు తెలుస్తోంది. రద్దయిన వాటిలో ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బస్సులున్నాయి.

 

Related News

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

BRS BC Meeting: బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా..? కాంగ్రెస్ ధర్నా సక్సెసే కారణమా?

CM Revanth Reddy: కేంద్రంలో బీజేపీని గద్దె దింపుతాం.. సిఎం రేవంత్ రెడ్డి

Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!

Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంది.. బీజేపీకి ఆ సత్తా ఉందా? మహేష్ గౌడ్ ఫైర్!

Big Stories

×