BigTV English

BRS : అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా.. ఆశా నిరాశేనా..?

BRS : అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా.. ఆశా నిరాశేనా..?

BRS : దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలని భావించిన కేసీఆర్‌కు ఏపీలో గట్టి షాక్ తగిలేలా ఉంది. ఏపీలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్‌తో తోట భేటీ కానున్నట్టు తెలుస్తోంది.


ఆయన గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు పార్లమెంటుకు, 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీకి ఆయన పోటీ చేశారు. పొత్తులో బాగంగా టీడీపీ కూడా జనసేనకు గుంటూరు పశ్చిమ టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉన్న రజనీకి చెక్ పెట్టాలంటే తోట అయితేనే సరైన వ్యక్తి అని జనసేన భావిస్తోంది.

అటు.. మరో కీలక నేత రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ కీలక నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈనెల 30న రావెల జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు.. మిగిలిన నేతల కూడా వేరే పార్టీలు చూసుకుంటున్నారు. ఇదే జరిగితే ఇక బీఆర్ఎస్ దుకాణం ఏపీలో బంధ్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది.


Related News

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

AP CM Chandrababu: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన.. సీఎం చంద్రబాబు

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Big Stories

×