E-Paper
Advertisement

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
Advertisement

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజూమున వేగంగా దూసుకెళ్లిన కారు సిమెంట్ లోడ్‌తో వెళ్తోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన తెన్‌కాసి జిల్లాలో చోటు చేసుకుంది.

తెన్కాసి జిల్లా పులియంగుడికి చెందిన ఆరుగురు స్నేహితులు నిన్న రాత్రి కారులో కుర్దాలం వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో పులియంగుడి సమీపంలోని పున్నయ్యపురం వద్ద వీరి కారును ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కార్తీక్, వేల్ మనోజ్ పులియంగుడికి చెందిన పోతిరాజ్, సుబ్రమణ్యం, మనో సుబ్రమణ్యం ప్రమాదంలో మృతి చెందినట్లుగా గుర్తించారు.

Advertisement

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెన్‌కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×