E-Paper
Advertisement

Jio Best Plans: జియో అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌లో సీక్రెట్ బెనిఫిట్.. తెలిస్తే యూజర్లు షాక్ అవ్వాల్సిందే

Jio Best Plans: జియో అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌లో సీక్రెట్ బెనిఫిట్.. తెలిస్తే యూజర్లు షాక్ అవ్వాల్సిందే

Jio Best Plans: జియో తాజాగా ప్రకటించిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇప్పుడు టెలికాం మార్కెట్‌లో పెద్ద సంచలనంగా మారాయి. ఎందుకంటే సాధారణంగా మనం రీచార్జ్ చేసేప్పుడు కాల్స్, డేటా, మెసేజెస్, వ్యాలిడిటీలు ఎంత ఉన్నాయి అన్నదే ముఖ్యంగా చూస్తాం. కానీ ఈసారి జియో ఇచ్చింది పూర్తిగా భిన్నమైన ఆఫర్. చిన్న రీచార్జ్‌తోనే గూగుల్ జెమినీ ఏఐ ప్రో యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. దీని ధర 35100 వేల రూపాయలు. ఇంత పెద్ద మొత్తం వున్న ఏఐ టెక్నాలజీని రీచార్జ్‌తో ఫ్రీగా అందించడం ఇప్పటివరకు ఏ కంపెనీ చేయలేదు కాబట్టి ఈ ఆఫర్‌పై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది.

4 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

ఇప్పుడు ఈ ప్లాన్స్ ఏమిటి అంటే జియో ఈ ఆఫర్ కింద మొత్తం 4 అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. వాటిలో మొదటిది 349 రూపాయల ప్లాన్. రెండోది 899 రూపాయల ప్లాన్. మూడోది 1029 రూపాయల ప్లాన్. చివరిది 3599 రూపాయల ప్లాన్. ఈ నాలుగు ప్లాన్స్‌లో ఏదైనా ఒకటి రీచార్జ్ చేస్తే గూగుల్ జెమినీ ఏఐ ప్రో యాక్సెస్ వెంటనే యాక్టివ్ అవుతుంది. ఇవన్నీ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కావడంతో వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్‌గా ఉంటాయి, డేటా కూడా అన్లిమిటెడ్. జియో 5జి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వేగం మరింత ఎక్కువగా లభిస్తుంది. జియో 5జి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వేగం మరింత ఎక్కువగా లభిస్తుంది. 5జి లేని ప్రాంతాల్లో కూడా 4జి స్పీడ్ చాలా బాగానే వస్తుంది, కనెక్షన్ కట్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.

గూగుల్ జెమినీ ఏఐ ప్రోతో ఏం బెనిఫిట్స్ అంటే..

ఇప్పుడు ఈ గూగుల్ జెమినీ ఏఐ ప్రో మనకు ఏం చేస్తుంది? ఇది సాధారణ చాట్‌బాట్ కాదు. ఇది అత్యున్నతమైన జనరేటివ్ ఏఐ మోడల్. మీరు రాయాలనుకునే ఏ అంశమైనా ప్రాజెక్ట్ రిపోర్ట్స్, స్కూల్ లేదా కాలేజ్ అసైన్‌మెంట్స్, యూ ట్యూబ్ స్క్రిప్ట్‌లు, బిజినెస్ ప్రపోజల్స్, రీసెర్చ్ మెటీరియల్, ఆర్టికల్స్ ఇవన్నీ కొన్ని నిమిషాల్లో తయారుచేసి ఇస్తుంది. అంతేకాదు ఈ ఏఐలో ఇమేజ్ జనరేషన్ మరియు వీడియో జనరేషన్ కూడా ఉన్నాయి. అంటే మీరు కోరుకున్న విధంగా పోస్టర్లు, థంబ్‌ నెయిల్స్, సోషల్ మీడియా కంటెంట్, ప్రమోషనల్ వీడియోలు తయారు చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకంగా క్రియేటర్లు, యూట్యూబర్లు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, ఉద్యోగస్తులకు మరింత ఉపయోగకరం. పైగా ఇందులో భాగంగా 2TB క్లౌడ్ స్టోరేజ్ కూడా వస్తుంది. అంటే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, పెద్ద ఫైళ్లు అన్నీ క్లౌడ్‌లో భద్రంగా సేవ్ చేసుకోవచ్చు. ఫోన్ మెమరీ ఫుల్ అవుతుంది.. డిలీట్ చేయాలి.. అంటూ ఆందోళన ఉండదు.

Also Read: BSNL SIM: బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ సేవలు అర్ధరాత్రి నుంచి షట్‌డౌన్.. సర్వీస్ సెంటర్లలో ఉద్రిక్తత

మొత్తం 18 నెలల పాటు ఫ్రీ..

ఈ ఆఫర్ కొనసాగే సమయం కూడా చిన్నది కాదు. మొత్తం 18 నెలల పాటు ఈ గూగుల్ జెమినీ ఏఐ ప్రో యాక్సెస్ పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అంటే సంవత్సరం కంటే ఎక్కువ కాలం పూర్తిగా ప్రీమియం ఏఐ సేవలు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఇది. సాధారణంగా ఈ సబ్‌స్క్రిప్షన్ మార్కెట్ ధర కంటూ చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ జియో ఇక్కడ ప్రజలకు ఎంతో విలువను ఇచ్చింది.

యాక్టివ్‌ట్ ఎలా చేయాలి?

ఈ ఆఫర్‌ను యాక్టివ్ చేయడం కూడా చాలా సులభం. మీ ఫోన్‌లో మైజియో యాప్ ఓపెన్ చేస్తే హోమ్ స్క్రీన్‌పై Google Gemini Offer అనే బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి, మీ గూగుల్ ఖాతాతో లాగిన్ చేసి యాక్టివ్‌ట్ చేస్తే సరిపోతుంది. యాక్టివేషన్ అయిన వెంటనే ఏఐ ఫీచర్లు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి రీచార్జ్ యాక్టివ్‌గా ఉండాలి. 5జి అన్లిమిటెడ్ ప్లాన్ ఆపేస్తే ఈ ఆఫర్ కూడా ఆగిపోతుంది.

టెక్నాలజీ మొత్తం ఏఐ వైపు

ఇప్పుడు ఆలోచిస్తే, మనం ప్రతి నెలా ఏదో ఒక రీచార్జ్ తప్పనిసరిగా చేస్తూనే ఉన్నాం. అదే రీ చార్జ్‌తో ఇంత భారీ ఏఐ ప్రయోజనం వస్తుంటే వదులుకోవడం నిజంగా నష్టమే. ఇంటర్నెట్ ఎక్కువగా వాడే వారు, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉండేవారు, వీడియోలు సృష్టించే వారు, చదువుకునే వారు అందరికీ ఇది సూపర్ ఉపయోగకరమైన ఆఫర్. టెక్నాలజీ మొత్తం ఏఐ వైపు తిరుగుతోంది. ఆ రేసులో వెనుక పడకుండా ఉండటానికి ఇది సరైన సమయం.

వెంటనే యాక్టివేట్ చేసుకోండి.. అవకాశం మళ్లీ రాదు

అందుకే సింపుల్‌గా చెప్పాలంటే.. జియో ఈసారి కేవలం ప్లాన్స్ అమ్మడం కాదు. టెక్నాలజీని జనాలకు చేరేలా చేస్తున్నది. గూగుల్ జెమినీ ఏఐ ప్రో లాంటి ప్రీమియం సేవను అందరికీ చేరేలా చేస్తుంది. మీకు సరిపోయే ఈ 4 ప్లాన్‌లలో ఏదైనా రీచార్జ్ చేసుకుని వెంటనే ఆఫర్ క్లెయిమ్ చేసేయండి. ఇది చాలా అరుదైన అవకాశం.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×