BigTV English

Metro in Old City : పాతబస్తీకి మెట్రో వస్తే మాకు ఇబ్బంది – ఈ ప్రాజెక్టు వద్దే వద్దు

Metro in Old City : పాతబస్తీకి మెట్రో వస్తే మాకు ఇబ్బంది – ఈ ప్రాజెక్టు వద్దే వద్దు

Metro in Old City : హైదరాబాద్ నగరానికి మణిహారమైన మెట్రో రైలు నిర్మాణాన్ని పాతబస్తీలో చేపట్టడానికి వీలు లేదంటూ ఓ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా పాత బస్తీ మీద నుంచి వెళుతున్న మెట్రో మార్గాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఓల్డ్ సిటీలోని అనేక చారిత్రక కట్టడాలు ఈ ప్రాజెక్టు కారణంగా దెబ్బతింటాయని, వాటిని సంరక్షించాల్సిన ప్రభుత్వం.. మెట్రో పేరుతో నష్టపరుస్తోందంటూ ఆరోపించింది.


ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టాడాలున్న ఓల్డ్ సిటీలోకి మెట్రో రైలు ప్రాజెక్టును అనుమతించడం సరైంది కాదని పిటిషనర్ సంస్థ కోర్టుకు తెలిపింది. తెలంగాణ హెరిటేజ్ చట్టం 2017 ప్రకారం చరిత్రలో ప్రాధాన్యత ఉన్న కట్టడాలను, నిర్మాణాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్న పిటిషనర్.. ప్రస్తుతం ప్రభుత్వం మెట్రో నిర్మిస్తామని చెబుతున్న మార్గంలో అనేక కట్టడాలు ఉన్నాయని తెలిపింది. చార్మినార్, ఫలక్ నుమా ఫ్యాలెస్, పురానా హవేలి, మొఘల్ పురా సమాధులు సహా అనేక నిర్మాణాలు, కట్టడాలు ఈ మార్గంలో ఉన్నట్లు పిటిషన్ లో తెలిపింది.

పురాతన కట్టడాలు, నిర్మాణాల పరిధిలో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదని కోర్టుకు తెలిపిన పిటిషనర్ సంస్థ.. దాని వల్ల ఆయా నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా మెట్రో రైలు వంటి భారీ నిర్మాణాలు చేపడితే.. కాపాడుకోవాల్సిన ప్రసిద్ధ నిర్మాణాలకు హాని జరిగే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పనుల్ని తక్షణమే నిలిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన సదరు సంస్థ.. హైకోర్టు ప్రతినిధులు కానీ, నిపుణుల బృందాన్ని కానీ నిర్మాణం జరిగే ప్రాంతానికి పంపించాలని కోరింది. వారి ఆమోదం తర్వాతే.. నిర్మాణాలు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని లేదంటే పూర్తిగా ప్రాజెక్టును ఆపేలా చర్యలు చేపట్టాలని హైకోర్టును కోరింది. కాగా.. ఈ కేసును విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు.. తదుపరి వాదనలు వినేందుకు ఫిబ్రవరి 17కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.


హైదరాబాద్ లో 2017లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉప్పల్ నుంచి రాయదుర్గ్, మియాపూర్ నుంచి ఎల్‌బి నగర్ వరకు రెండు లైన్లు.. సిటీ మధ్యలో పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎంజీబీఎస్ వరకు మూడో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గాల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. నగర ప్రజల నుంచి డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని మరిన్ని ప్రాంతాలకు మెట్రో సేవల్ని విస్తరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. మరిన్ని మార్గాల కోసం అన్వేషించింది. అలా.. 2024 సెప్టెంబర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఫేజ్ 2 కారిడార్‌ నిర్మాణాలకు ఆమోదం తెలిపారు.

ఈ సరికొత్త మార్గంలో హైదరాబాద్‌ నగర చివర్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరాన్ని అనుసంధానించే మెట్రో లైన్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే.. సిటీలోనే ఉంటూ.. మిగతా సిటీతో కనెక్టివిటీకి దూరంగా ఉన్న ఓల్డ్ సిటీ కోసం చాంద్రాయణగుట్ట నుంచి MGBS లైన్‌ను కలిపే లైన్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు కోసం మొత్తం 116.2 కిలోమీటర్ల కొత్త కారిడార్లకు ఆమోదం లభించింది. ఇప్పటికే.. వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే మెట్రో రైలు ప్రయాణ మార్గాన్ని నిర్ణయించిన అధికారులు.. ఆస్తులు కోల్పోతున్న వారికి నష్టపరిహారాన్ని సైతం అందించారు. ఈ దశలో మెట్రో రైలు ప్రాజెక్టును ఆపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడంతో తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×