BigTV English

Arekapudi Gandhi: అడ్డంగా దొరికిపోయాడు.. కౌశిక్‌ను ఇరికించిన గాంధీ

Arekapudi Gandhi: అడ్డంగా దొరికిపోయాడు.. కౌశిక్‌ను ఇరికించిన గాంధీ

Arekapudi Gandhi Fires On Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విబేధాలు తీసుకొచ్చేలా మాట్లాడుతున్నారని శేరిలింగంల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ఆరోపించారు. ఈ మేరకు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.


రాజకీయ సమయంలో రాజకీయం మాత్రమే చేస్తామని, అభివృద్ధి సమయంలో నాలుగేళ్ల 11 నెలలు అభివృద్ధి ధ్యేయంగా, పార్టీలకు అతీతంగా పనిచేస్తామన్నారు. దీంతో పాటు ఈ పదేళ్లలో ఎవరిని కూడా మీది ఏ పార్టీ అని అడగలేదన్నారు.

ఏ భాష ఎవరు మాట్లాడారని అనేది, మీరు చక్కగా ఉండి నన్ను మాట్లడమని చెబితే వింటానన్నారు. ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పే సమయంలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా మీ మాటలు వింటానన్నారు.


పదిసార్లు రెచ్చగొట్టావ్.. ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశావ్, మహిళలను ఇబ్బంది పడేలా పనులు చేశావని విమర్శించారు. మహిళలు కించపరిచేలా మాట్లాడిన తీరు మార్చుకోవాలని సూచించారు.

పార్టీలపరంగా యుద్ధాలు ఉంటాయని, కొన్నిసార్లు విమర్శలు చేసుకోవడం తప్పదన్నారు. కానీ నువ్వు వ్యక్తి పేరు పెట్టి మాట్లాడారని, నేను మాట్లాడింది తప్పే.. కానీ రెచ్చగొట్టడం వల్లు అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. హరీశ్ రావు కూడా నన్ను భాష మార్చుకోవాలని సూచించారని, ఆయన సీనియర్ నాయకుడని, ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్ లపై ఎలాంటి భాష వాడారో తెలుసన్నారు.

ఈ సమయంలో ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను లైవ్ లో మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కౌశిక్ రెడ్డి … ఏం పీకుతారని, నా కారు అద్దాలు పగలకొట్టవచ్చు, వాడయ్యా జాగీరా, మా అయ్యా జాగీరి అని మాట్లాడారు. అంతే కాకుండా తెలంగాణ బిడ్డను నేను. ఆంధ్రోడివి నువ్వు అంటూ ఘాటుగా మాట్లాడారు. కృష్ణా జిల్లా నుంచి బతకడానికి వచ్చిన నువ్వు.. హైదరాబాద్‌ను విడిచి పెట్టి వెళ్లిపో అన్నారు.

అలాగే మేము తెలంగాణ బిడ్డలమని, నిఖార్సైన తెలంగాణ బిడ్డలమని, ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డను అన్నారు. నీలాగా ఆంధ్ర నుంచి బతకడానికి రాలేదని, రేపు తెలంగాణ పౌరుషం చూపిస్తామని సవాల్ విసిరారు. ఇలా మాట్లాడని భాషను చేశారు కదా అని వివరించారు.

Also Read: రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్.. మాజీ మంత్రి హరీశ్ రావు

అందుకే నేను కౌశిక్ రెడ్డికి ఇంటికి వచ్చానని, కానీ నువ్వు ఏం చేశావ్..రాళ్లు రువ్వావ్ అన్నారు. ఇంట్లో నుంచి పూల కుండీళ్లు విసిరి మాట్లాడిన భాష ఏరకంగా ఉందో లైవ్ లో చూడాలని చూపించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అసలు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థి ఎందుకు వచ్చిందో ఆలోచించాలన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×