Chiranjeevi – Bobby :మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆగస్టు 22 (రేపు)న తన 70వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్ల కోసం అభిమానులు తాజాగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెట్ పై ఉంచిన సినిమాలతో పాటు త్వరలో సెట్ పైకి తీసుకెళ్లబోయే సినిమాలను కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవి నటించబోయే ఒక కొత్త సినిమా అనౌన్స్మెంట్ రేపు రాబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మరి చిరంజీవి ఏ డైరెక్టర్ తో తన కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్మెంట్ రేపే..
ప్రముఖ యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby kolli) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీనారాయణ నిర్మిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, మెగా డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఆగస్టు 22వ తేదీన అధికారిక ప్రకటన వెలువడనుంది. రేపు చిరంజీవి బర్త్డే కావడంతో ఈ సందర్భంగా ఈ కొత్త మూవీని అనౌన్స్మెంట్ చేయబోతున్నారు మేకర్స్. మొత్తానికి అయితే బాబీ డైరెక్షన్లో సినిమా అనేటప్పటికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ఇద్దరి కాంబినేషన్లు రాబోతున్న సినిమా జానర్ ఏంటి..? నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
విశ్వంభరపై చిరంజీవి బిగ్ అప్డేట్..
ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassishta mallidi).దర్శకత్వంలో విశ్వంభర(Vishwambhara )సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా..” రెండవ భాగం మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పైన ఆధారపడిందని.. అత్యున్నతమైన ప్రమాణాలతో సినిమాల విడుదల చేయాలనే నేపథ్యంలోనే సినిమా షూటింగ్ వాయిదా వేశారు.. ఈరోజు సాయంత్రం 6:06 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు మేకర్స్.. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా విడుదల ఉంటుంది .. నాది భరోసా” అని ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.
మెగా 157 సినిమా టైటిల్ రివీల్..
మరొకవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు చిరంజీవి.ఈ సినిమాకి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈరోజు (ఆగస్టు 21)సాయంత్రం 4:32 గంటల నుంచి హైదరాబాదులోని శిల్పకళా వేదికగా నిర్వహించనున్న మెగా బర్తడే సెలబ్రేషన్స్ లో ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయబోతున్నారట.. ఈ విషయాన్ని 90 ‘S వెబ్ సిరీస్ నటుడు మౌళి హీరోగా చేస్తున్న లిటిల్ హార్ట్స్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనిల్ రావిపూడి వెల్లడించారు. మొత్తానికి అయితే మెగా బర్తడే సందర్భంగా వరుస అప్డేట్లు అభిమానులలో ఫుల్ జోష్ నింపుతున్నాయని చెప్పవచ్చు.
ALSO READ:Disco Shanti: అయినవాళ్లే దూరం పెట్టారు.. ఆకలితో నరకం చూశాం – డిస్కో శాంతి