BigTV English

Green Data center: తెలంగాణలో గ్రీన్‌ డేటా సెంటర్.. రూ. 3,320 కోట్ల పెట్టుబడులు

Green Data center: తెలంగాణలో గ్రీన్‌ డేటా సెంటర్.. రూ. 3,320 కోట్ల పెట్టుబడులు

Aurum Equity Partners invest in Hyderabad(Telangana news): సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెల్లుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ ముందుకొచ్చింది. 400 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు 3 వేల 320 కోట్ల రూపాయల
ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెట్టనుంది.


హైదరాబాద్‌లో నెక్ట్స్ జనరేషన్, అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్‌ నిర్మిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. దశలవారీగా ఆ పెట్టుబడులు ఉంటాయని అన్నారు. ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ సంస్థ సీఈవో వెంకట్ బుస్సాతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్​ బాబుతో సమావేశం అయ్యారు. ఈ పెట్టుబడులపై చర్చించారు. 400 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని గత ఏడాదే ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు దాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

100 మెగావాట్ల ప్రతిశష్టాతికమైన ఏఐ ఆధారితకు సంబంధించిన డేటా సెంటర్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డేటా సెంటర్‌ అందుబాటులోకి వస్తే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య గ్యాప్ తగ్గుతుందని సంస్థ సీఈవో, చైర్మన్ వెంకట్ బుస్సా చెప్పారు. ఈ-సేవ, ఈ-పేమెంట్, ఈ -ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఆరమ్ ప్రతినిధులు హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు.


Also Read: బతుకమ్మ చీరలకు ఇక స్వస్తి..వాటికి బదులు గిఫ్ట్ లు ఇచ్చే యోచన

దీంతో.. భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌ను ఆరమ్ ప్రతినిధుల నిర్ణయం మరో స్థాయికి తీసుకెళ్తోందని చెప్పారు. అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్‌జెన్‌.. తెలంగాణలో కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

హైటెక్ సిటీలో 6 అంతస్థుల భవనం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో.. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సంవత్సరం చివరి నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు నిర్నహించనుంది.
ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో . అమెరికాలో ప్రతీ రాష్ట్రానికి ఓ ట్యాగ్ లైన్ ఉందని.. అలాంటి ప్రత్యేకమైన నినాదంతో తెలంగాణ రాష్ట్రంతో ముందుకు తీసుకెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అనేది మన ట్యాగ్ లైన్ అని సీఎం ప్రకటించారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×