BigTV English

Manish sisodia: మనీష్ సిసోడియా టీ తాగుతూ.. 17 నెలల తర్వాత అంటూ..

Manish sisodia: మనీష్ సిసోడియా టీ తాగుతూ.. 17 నెలల తర్వాత అంటూ..

Manish sisodia latest tweet(Telugu news updates): ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులు బయటపడుతున్నారా? మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ వెనుక ఏం జరిగింది? ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏంటి? 17 నెలల తర్వాత ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్ అని ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు ఆ స్కామ్‌లో ఉన్న నిందితులను వెంటాడుతోంది.


ఢిల్లీ మద్యం కుంభకోణంలో దాదాపు 17 నెలలపాటు తీహార్ జైలులో ఉన్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. జైలు నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు.

శనివారం ఉదయం నిద్ర లేవగానే వైఫ్‌తో కలిసి టీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేసుకున్నారాయన. 17 నెలల తర్వాత ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్ అంటూ రాసుకొచ్చారు. భారతీయ పౌరులకు రాజ్యాంగం నుంచి జీవించే హక్కు వచ్చిందే ఈ స్వేచ్ఛ అని ట్వీట్ చేశారు.


ALSO READ: ఆ ఎనిమిది రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే భారత్ కు మహర్ధశే..

రాజకీయ నాయకుడి మాటలకు అర్థాలు వేరులే అన్నట్లు మనీష్ సిసోడియా ట్వీట్‌కు చాలామంది అర్థాలు వెతుకుతున్నారు. శుక్రవారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయిన వెంటనే, నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. సిసోడియాను చూడగానే కేజ్రీవాల్ వైఫ్ సునీత కంటతడి పెట్టారు. అలాగే కేజ్రీవాల్ పేరెంట్స్ ఆశీర్వాదాలు తీసుకున్నారు సిసోడియా. జైలుకు వెళ్లిన నుంచి ఇప్పటివరకు తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారాయన.

 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×