E-Paper
Advertisement

గ్యాస్ సెగ.. రోడ్డుకెక్కిన ఆటో డ్రైవర్లు.. స్తంభించిన సాగర్ హైవే!

గ్యాస్ సెగ.. రోడ్డుకెక్కిన ఆటో డ్రైవర్లు.. స్తంభించిన సాగర్ హైవే!
Advertisement

Auto Protest: హైదరాబాద్: నగర జీవనవాహినిలో కీలకమైన ఆటో రిక్షాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా నగరంలో కొనసాగుతున్న LPG కొరత ఆటో డ్రైవర్ల సహనాన్ని పరీక్షించింది. గంటల తరబడి బంకుల వద్ద వేచి చూసినా గ్యాస్ దొరకకపోవడంతో ఆగ్రహించిన డ్రైవర్లు, బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ నిరసన చేపట్టారు. తమ ఆటోలను ప్రధాన రహదారిపై అడ్డంగా నిలిపివేసి ప్రభుత్వానికి, గ్యాస్ సరఫరా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ట్రాఫిక్ పద్మవ్యూహం..
ఈ ఆకస్మిక ధర్నాతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి ఒక్కసారిగా స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ బస్సులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయాయి. గ్యాస్ దొరక్కపోతే తమ పొట్ట ఎలా గడుస్తుందని, రోజుకు కనీసం రూ.500 కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు.

Advertisement

కొరతకు అసలు కారణమేంటి?
నగరంలోని మెజారిటీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లలో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సరఫరా గొలుసులో తలెత్తిన లోపాలు, ప్లాంట్ల నుండి లోడింగ్ తగ్గడం వల్ల ఈ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో కృత్రిమ కొరత సృష్టించబడుతుందనే అనుమానాలను కూడా డ్రైవర్లు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు గ్యాస్ అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కుటుంబాలు గడవని పరిస్థితి..
“ఉదయం 4 గంటల నుంచి బంకుల దగ్గర క్యూ కడుతున్నాం, తీరా మా వంతు వచ్చేసరికి గ్యాస్ అయిపోయిందని బోర్డు పెడుతున్నారు” అని ఒక డ్రైవర్ కన్నీరు పెట్టుకున్నారు. రోజువారీ కిరాయిలు చెల్లించి, గ్యాస్ కోసం తిరుగుతూ సమయమంతా రోడ్ల మీదనే గడిచిపోతోందని, ఇంట్లో పిల్లల చదువులు, తిండికి కూడా పైసలు మిగలడం లేదని వారు వాపోతున్నారు. ఆటోల నడకపైనే ఆధారపడ్డ లక్షలాది మంది కుటుంబాలు ఇప్పుడు గ్యాస్ కొరతతో రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

Advertisement

Also Read: మాంసం ప్రియులకు షాక్.. తెలంగాణలో చికెన్ బంద్.. నేటి నుంచి మూతపడనున్న 50 వేల షాపులు!

ప్రభుత్వ జోక్యం అవసరం..
ఈ సంక్షోభం కేవలం ఎల్బీనగర్‌కే పరిమితం కాకుండా నగరం నలుమూలలా విస్తరిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో మాట్లాడాలని, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరంతరాయంగా గ్యాస్ అందేలా చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో నగరవ్యాప్తంగా ఆటో బంద్ చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. సామాన్యుడి రవాణా భారంగా మారకముందే పాలకులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×