E-Paper
Advertisement

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విషాదం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?
Advertisement

JNTU Hyderabad: హైదరాబాద్‌ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ- జేఎన్‌టీయూ క్యాంపస్‌లో విషాదం వెలుగుచూసింది. బీటెక్ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సొంతూరు ఖమ్మం జిల్లాకి చెందినవాడు.

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విషాదం

హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంపస్‌లో విషాదం జరిగింది. బీటెక్ విద్యార్థి ఒకరు హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్‌పల్లిలోని గౌతమ్ బాయ్స్ హాస్టల్‌లో అర్ధరాత్రి తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన 19 ఏళ్ల విక్రమ్ బాబు, జేఎన్‌టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థి. ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

Advertisement

ఇటీవల విడుదల చేసిన సెమిస్టర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఫెయిల్ కావడాన్ని తట్టుకోలేకపోయిన బాబు, అర్ధరాత్రి హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన విక్రమ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై హాస్టల్ అధికారులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ALSO READ: బిర్యానీ ప్రియులకు ఝలక్.. హైదరాబాద్‌లో అమాంతంగా పెరిగిన ధరలు!

Advertisement

విద్యార్థి మృతితో క్యాంపస్‌ అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్‌బాబు ఘటన గురించి తెలియగానే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఖమ్మం నుంచి వెంటనే కాలేజీకి బయలుదేరారు.

Related News

బిర్యానీ ప్రియులకు ఝలక్.. హైదరాబాద్‌లో అమాంతంగా పెరిగిన ధరలు!

బీటెక్ స్టూడెంట్ మిస్సింగ్.. హైదరాబాద్ టు విశాఖ జర్నీలో ఏమైంది? పోలీసులు లోతుగా..

మండి రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. కస్టమర్లు పరుగో పరుగు, హైదరాబాద్ సిటీలో ఘటన

సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పై.. పోక్సో కేసు నమోదు!

గద్వాల బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థినుల ఆవేదన.. వేధిస్తున్న ఆకతాయిలు!

13 వరల్డ్ రికార్డులు, 87 అవార్డులు, 2 డాక్టరేట్లు.. ఖమ్మం జిల్లా యువకుని మెమరీ సీక్రెట్ ఇదే?

నత్తనడగా సాగుతున్న ‘ప్రసాదం’ పథకం పనులు.. పూర్తికాని నిర్మాణాలు!

Big Stories

Advertisement
×