E-Paper
Advertisement

బిర్యానీ ప్రియులకు ఝలక్.. హైదరాబాద్‌లో అమాంతంగా పెరిగిన ధరలు!

బిర్యానీ ప్రియులకు ఝలక్.. హైదరాబాద్‌లో అమాంతంగా పెరిగిన ధరలు!
Advertisement

Hyderabad Biryani: ఎల్‌నినో ఎఫెక్టు అన్ని రంగాలపై భారం పడుతోంది. కూరగాయలు ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో కామన్ మేన్ జేబుకు చిల్లు పడింది. తాజాగా బిర్యానీ ప్రేమికులు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లో బిర్యానీ ధరలు అమాంతంగా పెరగడంతో అటు వైపు చూసేందుకు సామాన్యులు రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు.

బిర్యానీ ప్రియులకు ఊహించని ఝలక్

హైదరాబాద్ బిర్యానీ గురించి చెప్పనక్కర్లేదు. నగరానికి వచ్చినవారు, టేస్టు చేసేందుకు చాలామంది ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్లకు వెళ్తుంటారు. బియ్యం నుంచి రకరకాల ధరలు పెరగడంతో దాని ప్రభావం బిర్యానీపై పడింది. అయితే నాన్‌వెజ్ ధర ఎప్పటి మాదిరిగానే ఉన్నా, మిగతా సరకుల ధరలకు రెక్కలు రావడంతో ఒక్కో బిర్యానీ రెస్టారెంట్లు ధరలు పెంచడం మొదలుపెట్టాయి.

Advertisement

హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు మొదలు అమీర్‌పేట వరకు , ఎల్‌బీ నగర్ నుంచి హైటెక్ సిటీ వరకు బిర్యానీ షాపులు ధరలు అమాంతంగా పెంచేశాయి. తక్కువలో తక్కువ రూ.20 నుంచి మొదలైన వడ్డన దాదాపు రూ.100 వరకు పెంచినట్టు సమాచారం. చాలా మంది తక్కువగా ఉంటుందని భావించారు. బిల్లు చూసిన తర్వాత ఒక్కసారిగా షాకయ్యారు. ఒకవేళ అడిగితే ధరలు పెంచి చాలా రోజులు అయ్యిందని నిర్వాహకులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో బిర్యానీ ధరలకు రెక్కలు!

హైదరాబాద్‌ సిటీలో దాదాపు పాతికవేలకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో బయట తినేవారు ఎక్కువగా ఉన్నారు. ధరల పెంపుతో సామాన్యులు, బ్యాచిలర్ల జేబులు ఖాళీ అవుతున్నాయి. సిటీలో ప్రతీ రోజూ 4 నుంచి 6 లక్షల వరకు బిర్యానీలు అమ్ముడవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్కో ప్లేట్‌పై తక్కువగా రూ.30 పెరిగితే సామాన్యులపై రోజుకు రూ.1.8 కోట్ల అదనపు భారం పడుతుంది.

Advertisement

ఆ లెక్కన నెలకు రూ.54 కోట్లు అన్నమాట. రెస్టారెంట్ల నిర్వాహకుల వెర్షన్ మరోలా ఉంది. ముడిసరుకు ధరలు దాదాపు 20 వరకు పెరిగాయని చెబుతున్నారు. గ్యాస్ మొదలు వంట నూనె, బియ్యం, మిగతా సరుకుల ధరలు పెరిగాయని అంటున్నారు.  కిలో నెయ్యి ధర అమాంతంగా అంటే ప్రస్తుతం రూ.800 దాటిందని చెబుతున్నారు. వర్షాలు లేకపోవడం వల్ల కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. నాన్‌వెజ్ మాత్రం నార్మల్ గానే ఉంది. ఇప్పుడున్న ధరలతో హోటల్‌ బిజినెస్‌‌కి కష్టాలు పొంచి ఉన్నాయని అంటున్నారు.

ALSO READ: బీటెక్ స్టూడెంట్ మిస్సింగ్.. హైదరాబాద్ టు విశాఖ జర్నీలో ఏమైంది? పోలీసులు లోతుగా

లాభాలు ఏమోగానీ, అధికంగా నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఒకప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ తెప్పించుకునే యువతీ యువకులు అటువైపు చూడడం మానేశారు. ప్రస్తుతం కార్తీక మాసం అందుకు ఓ కారణం. డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు అన్నీ కలిపితే యువకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. పెట్టుబడి వ్యయం పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మెనూలో మార్పులు చేయాల్సి వస్తుందని అంటున్నారు రెస్టారెంట్ల నిర్వాహకులు.

Related News

బీటెక్ స్టూడెంట్ మిస్సింగ్.. హైదరాబాద్ టు విశాఖ జర్నీలో ఏమైంది? పోలీసులు లోతుగా..

మండి రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. కస్టమర్లు పరుగో పరుగు, హైదరాబాద్ సిటీలో ఘటన

సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పై.. పోక్సో కేసు నమోదు!

గద్వాల బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థినుల ఆవేదన.. వేధిస్తున్న ఆకతాయిలు!

13 వరల్డ్ రికార్డులు, 87 అవార్డులు, 2 డాక్టరేట్లు.. ఖమ్మం జిల్లా యువకుని మెమరీ సీక్రెట్ ఇదే?

నత్తనడగా సాగుతున్న ‘ప్రసాదం’ పథకం పనులు.. పూర్తికాని నిర్మాణాలు!

అమాయకుల సొమ్ముతో రియల్టర్ల దందా.. నారాయణఖేడ్‌లో అసలేం జరుగుతోంది?

Big Stories

Advertisement
×