E-Paper
Advertisement

13 వరల్డ్ రికార్డులు, 87 అవార్డులు, 2 డాక్టరేట్లు.. ఖమ్మం జిల్లా యువకుని మెమరీ సీక్రెట్ ఇదే?

13 వరల్డ్ రికార్డులు, 87 అవార్డులు, 2 డాక్టరేట్లు.. ఖమ్మం జిల్లా యువకుని మెమరీ సీక్రెట్ ఇదే?
Advertisement

Memory Power: సాధారణంగా మనం ఏదైనా విషయం గుర్తుపెట్టుకోవాలంటే పదిసార్లు బట్టీ పడతాం. కానీ, ఈయనకు ఆ అవసరమే లేదు. ఒక్కసారి కళ్లతో చూస్తే చాలు.. అది 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ అయినా సరే, ప్రింట్ తీసినట్లు మెదడులో రికార్డ్ అయిపోతుంది. దాన్ని సీదాగా చెప్పడమే కాదు, రివర్స్ ఆర్డర్‌లో కూడా ఏమాత్రం ఆలోచించకుండా టకటకా చెప్పేస్తాడు. ఈ అద్భుతమైన ప్రతిభ ఉన్న కుర్రాడి పేరు గుగ్గిళ్ళ దివ్యమూర్తి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన ఓ సాధారణ యువకుడు.

పవర్ ఎలా వచ్చింది?

ఇంతకీ దివ్యమూర్తికి ఈ రేంజ్ మెమరీ పవర్ ఎలా వచ్చింది? ఇది పుట్టుకతో వచ్చిన మ్యాజిక్ కాదు.. ఆయన కష్టపడి పెంచుకున్న అలవాటు. ఇప్పటివరకు దివ్యమూర్తి ఏకంగా 3 వేల పుస్తకాలు చదివాడు. అవును, మీరు విన్నది నిజమే.. మూడు వేల బుక్స్. దేశాలు – రాజధానులు, రాష్ట్రాలు – వాటి చరిత్ర, రాజకీయాలు, జాగ్రఫీ.. ఇలా ఏ సబ్జెక్ట్ గురించి అడిగినా ఇట్టే సమాధానం చెబుతాడు. ఈయన టాలెంట్ చూసి ఇప్పటివరకు 87 అవార్డులు, 13 వరల్డ్ రికార్డులు, రెండు గౌరవ డాక్టరేట్లు వరించాయి.

యువ మేధావి ప్రయత్నం

Advertisement

ఓవైపు సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతూనే.. మరోవైపు ఖాళీ దొరికినప్పుడల్లా స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నాడు. ఫోన్లకు దూరంగా ఉండి, పుస్తకాలు చదవడం వల్ల మన బ్రెయిన్ ఎలా యాక్టివ్ అవుతుందో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా నేర్పిస్తున్నాడు. చదువు అంటే కేవలం మార్కుల కోసం బట్టీ పట్టడం కాదు.. విషయాన్ని అర్థం చేసుకుని మెదడుకు పదును పెట్టడం అని దివ్యమూర్తి నిరూపిస్తున్నాడు. తను నేర్చుకున్న విద్యను తనతోనే ఉంచుకోకుండా, పదిమంది పిల్లల భవిష్యత్తు కోసం పంచుతున్న ఈ యువ మేధావి ప్రయత్నం నిజంగా గ్రేట్!

Also Read: సిరిసిల్లలో చనిపోయిన వారి పేర్లతో లేబర్ కార్డుల దందా.. బీమా సొమ్ము మాయం

Tags

Related News

నత్తనడగా సాగుతున్న ‘ప్రసాదం’ పథకం పనులు.. పూర్తికాని నిర్మాణాలు!

అమాయకుల సొమ్ముతో రియల్టర్ల దందా.. నారాయణఖేడ్‌లో అసలేం జరుగుతోంది?

తెలంగాణ ఆర్టీసీ మూడు యాప్‌ల దందాపై ప్రయాణికుల ఫైర్!

పాలమూరులో నిబంధనలను విరుద్ధంగా.. ప్రభుత్వ ఉద్యోగులు!

మిస్ తెలంగాణ-2026 విజేత.. కొత్త లీలాకు ఘన సన్మానం

చేతికొచ్చిన వరి పంట కోసం.. ట్యాంకర్ల నీళ్లతో పోరాటం!

ఖమ్మం ప్రజలకు గుడ్ న్యూస్.. దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపు?

Big Stories

Advertisement
×