Hyderabad City: కారణాలు ఏమైనా కావచ్చు.. శీతాకాలంలో అగ్ని ప్రమాద ఘటనలు జరగడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా రాత్రి హైదరాబాద్ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అసలు ఘటన ఎలా జరిగింది?
హైదరాబాద్ సిటీలోని టోలీచౌక్ ప్రాంతంలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండి రెస్టారెంట్‌లో అసస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ అలముకోవడంతో ఆ సమయంలో రెస్టారెంట్ లోపల ఉన్న వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. భయంతో రెస్టారెంట్ నుంచి పరుగులు తీశారు. ఆదివారం అర్ధరాత్రి మండి కింగ్ రెస్టారెంట్ ఈ ఘటనకు వేదికైంది.
మిడ్ నైట్ సమయంలో తొలుత రెండో అంతస్తులోని హోటల్ కిచెన్ చిమ్నీలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆరో అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. ఘటనపై అప్రమత్తమైన హోటల్ సిబ్బంది.. లిఫ్ట్ ఆపేశారు. రెస్టారెంటులోని కస్టమర్లను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు తరలించారు.
గ్యాస్ సిలిండర్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో మండీ రెస్టారెంటుకు పక్కనున్న జునేరా రెస్టారెంట్ డ్యామేజ్ అయ్యింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రెస్టారెంట్ యాజమాన్యంతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ: సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పై.. పోక్సో కేసు నమోదు!
Fire at Mandi King’s chimney, but Zunera Restaurant faced the fallout! Who will take responsibility? #HyderabadNews #Tolichowki #ZuneraRestaurant #MandiKing pic.twitter.com/o0y2R3bfb2
— Viquar e deccan (@Viquaredeccan) November 15, 2026