E-Paper
Advertisement

సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పై.. పోక్సో కేసు నమోదు!

సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పై.. పోక్సో కేసు నమోదు!
Advertisement

Siddipet Principal: సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేందర్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం విచారణ చేపట్టారు. అయితే గత నెల రోజులుగా ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నారని, రాత్రి వేళల్లో వసతి గృహానికి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఫోన్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోక్సో కేసు నమోదు..

సిద్దిపేట జిల్లాలోని వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ రాజేందర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. విద్యార్థినులను వేధించినట్లు వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే రాత్రి వేళల్లో హాస్టల్‌కు వెళ్లి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థినులకు ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కోన్నారు.

విచారణ కమిటీ ఏర్పాటు..

Advertisement

ప్రిన్సిపల్ వేధింపులపై తల్లిదండ్రులు విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం క్షున్నంగా విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించి నివేదికను విచారణ కమిటీ సమర్పించింది. దీంతో పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే విచారణ నివేదిక ఆధారంగా ప్రిన్సిపల్‌పై కఠినమైన చర్యలకు పోలీసులు, అధికారులు సిద్దమయ్యారు. తాజాగా పోక్సో చట్టం కింద పలు సెక్షన్లు చేర్చి ప్రిన్సిపల్ రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడ ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also read: కర్నూలులో అద్భుత ఆచారం.. ఇక్కడ పాలు అమ్మబడవు.. కానీ అందరికి ఉచితం?

Tags

Related News

గద్వాల బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థినుల ఆవేదన.. వేధిస్తున్న ఆకతాయిలు!

13 వరల్డ్ రికార్డులు, 87 అవార్డులు, 2 డాక్టరేట్లు.. ఖమ్మం జిల్లా యువకుని మెమరీ సీక్రెట్ ఇదే?

నత్తనడగా సాగుతున్న ‘ప్రసాదం’ పథకం పనులు.. పూర్తికాని నిర్మాణాలు!

అమాయకుల సొమ్ముతో రియల్టర్ల దందా.. నారాయణఖేడ్‌లో అసలేం జరుగుతోంది?

తెలంగాణ ఆర్టీసీ మూడు యాప్‌ల దందాపై ప్రయాణికుల ఫైర్!

పాలమూరులో నిబంధనలను విరుద్ధంగా.. ప్రభుత్వ ఉద్యోగులు!

మిస్ తెలంగాణ-2026 విజేత.. కొత్త లీలాకు ఘన సన్మానం

Big Stories

Advertisement
×