Nazriya Nazim:ఈ ఏడాది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు టాలీవుడ్లో తేజ సజ్జ (Teja Sajja) నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా జరుగుతుండగా.. ఇటు ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) తన చెల్లి పెళ్లి అయిపోయింది అంటూ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన చెల్లితో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను, పెళ్లి వేడుకల్లో సందడి చేసిన విశేషాలను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను నజ్రియా షేర్ చేస్తూ.. “నా చిన్న చెల్లికి పెళ్లి అయిపోయింది. ఆమెను ఎత్తుకొని తిరిగిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ముఖ్యంగా నా చిన్న చెల్లితో నేను నిన్ననే ఆడుకున్నట్టు అనిపిస్తోంది. కానీ అప్పుడే ఆమెకు పెళ్లయిపోయింది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, నీ అందమైన చిరునవ్వు ఎప్పటికీ నిలిచిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మేము నీకు అండగా ఉంటాము. సోహైల్.. మీకు మా కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను” అంటూ నూతన వధూవరులను ఉద్దేశించి నజ్రియా షేర్ చేసిన ఫోటోలు, పంచుకున్న క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే నజ్రియా చెల్లి తన అక్కలాగే చాలా క్యూట్ గా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నజ్రియా నజీమ్ విషయానికి వస్తే.. కేరళకు చెందిన ఈమె మలయాళం టీవీ ఛానల్ ఏషియా నెట్ లో వ్యాఖ్యాతగా తన కెరియర్ ను ప్రారంభించింది. అయితే 2006 లోనే పలుంకు అనే మలయాళ చిత్రంతో బాలనటిగా తన కెరియర్ ను ప్రారంభించిన ఈమె.. 2013 లో వచ్చిన మ్యాడ్ డాడ్ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే 2013లో వచ్చిన రాజా రాణి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ క్యూట్ సుందరి. మలయాళం, తమిళ్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. 2022లో తొలిసారి అంటే సుందరానికి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక మోస్తారుగా మెప్పించింది. ఇకపోతే ఈమె హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది.
also read:ఘనంగా తేజ సజ్జ నిశ్చితార్థం..హాజరవుతున్న సినీ, రాజకీయ ప్రముఖులు!
ప్రముఖ సినీ నటుడు ఫహద్ ఫాజిల్ తో ఏడడుగులు వేసిన ఈమె.. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సూర్య సీన్ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాయ అనే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తమిళ్ యాక్షన్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి జితూ మాధవన్ దర్శకత్వం వహించారు. ప్రేమలు సినిమాతో హీరోగా ఆకట్టుకున్న నెస్లెన్ ఇందులో విలన్ పాత్ర పోషించారు. మొత్తానికైతే సీన్ చిత్రంతో మరోసారి తన అద్భుతమైన నటనను కనబరిచి అందరినీ ఆకట్టుకుంది.