E-Paper
Advertisement

ప్రేమించిన పాపానికి 17 చోట్ల కత్తిపోట్లు.. నడిరోడ్డుపై యువకుడి ప్రాణం తీశారు!

ప్రేమించిన పాపానికి 17 చోట్ల కత్తిపోట్లు.. నడిరోడ్డుపై యువకుడి ప్రాణం తీశారు!
Advertisement

Sitaphalmandi Crime: సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యావన్ (23) అనే బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని సీతాఫల్‌మండి నడిరోడ్డుపై ప్రత్యర్థులు కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. నిందితులు యువతి బంధువులేనని పోలీసులు నిర్ధారించారు.

మృతుడు యావన్ గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. యావన్‌ను పలుమార్లు హెచ్చరించినా అతను తన ధోరణి మార్చుకోలేదు. పైగా సీతాఫల్‌మండిలో ఉండే తన స్నేహితుడి ఇంట్లోనే ఉంటూ తరచూ ఆ యువతిని కలుస్తున్నాడు. ఈ ప్రవర్తనపై కోపం పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం నిన్న రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు దుండగులు స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు.

Advertisement

యావన్ తన మిత్రులతో కలిసి టీవీ చూస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా లోపలికి చొరబడి కత్తులతో దాడికి దిగారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి యావన్ బయటకు పరిగెత్తినా వదలకుండా నడిరోడ్డుపై వెంబడించి నరికి చంపారు. దుండగులు అత్యంత క్రూరంగా యావన్ శరీరంపై 17 చోట్ల కత్తులతో పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితులు దాడి చేసిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బహిరంగ ప్రదేశంలో యువకుడిని వెంటాడి చంపడంతో సీతాఫల్‌మండి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉన్నత చదువులు చదువుతూ భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా దారుణ హత్యకు గురికావడం విషాదం నింపింది.

Advertisement

Read Also: సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. చెల్లాచెదురైన ప్రయాణికులు!

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×