ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. భారతదేశ ఇంధన రంగ దిగ్గజం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పర్యావరణ పరిరక్షణ విభాగంలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
2032 సంవత్సరం నాటికి 149 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఎన్‌టీపీసీ ముందుకు సాగుతోంది. ఈ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా పర్యావరణ నిర్వహణను మరింత బలోపేతం చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్) విభాగంలో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌టీపీసీ ప్రాజెక్టుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడంలో ఈ అధికారుల పాత్ర కీలకం కానుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
విద్యార్హత: అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. ఒకవేళ ఇంజనీరింగ్ లేని పక్షంలో ఎన్విరాన్మెంట్ సైన్స్ లేదా మేనేజ్‌మెంట్ సబ్జెక్టులలో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఎంఎస్సీ లేదా ఎంటెక్‌లో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన వారు కూడా ఈ పోస్టులకు అర్హులు.
వయస్సు: అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ అలాగే ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ అలాగే దివ్యాంగులకు సైతం కేటగిరీల వారీగా మినహాయింపులు వర్తిస్తాయి.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం అందుతుంది. దీంతో పాటు సంస్థ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ: అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీలు: దరఖాస్తు ప్రక్రియ 2026 మే 8 నుంచి ప్రారంభమవుతుంది. మే 22వ తేదీని దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ సహా ఓబీసీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ అలాగే ఎస్టీ తోపాటు దివ్యాంగులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
సెలక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ రెండు విభాగాల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ పరీక్ష తేదీలు అలాగే హాల్ టికెట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని సంస్థ సూచించింది.
అఫీషియల్ వెబ్ సైట్: https://careers.ntpc.co.in/
ALSO READ: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్: రూ. లక్ష వరకు వివాహ రుణం.. దరఖాస్తు చేసుకోండి ఇలా!