Global Summit: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సదస్సు వివరాలను తెలియజేసేందుకు ఉమ్మడి పది జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సదస్సు లక్ష్యాలు, పెట్టుబడి అవకాశాలు, ఆశిస్తున్న ఫలితాలను వారికి వివరిస్తారు. సదస్సులో ఏర్పాటు చేసే ప్రదర్శనలు, వివిధ రంగాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను తెలియజేస్తారు. ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వాన కమిటీ ద్వారా అధికారికంగా ఆహ్వానాలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. జిల్లా యంత్రాంగం సహకారంతో వీలైనంత వరకు ఆయా జిల్లాల్లోనే సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
Also Read: మనుషులను మొక్కలుగా మార్చే వింత టెక్నాలజీ… ఆ తర్వాత వరుస హత్యలు… మతిపోగొట్టే సైఫై థ్రిల్లర్
హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్, జయేశ్ రంజన్ ఐఏఎస్.
రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వికాస్‌రాజ్ ఐఏఎస్.
కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు, బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా ఐఏఎస్.
మెదక్ – వివేక్ వెంకటస్వామి, డి.ఎస్.లోకేశ్‌కుమార్ ఐఏఎస్.
నిజామాబాద్ – దనసరి అనసూయ సీతక్క, డాక్టర్ యోగితా రాణా ఐఏఎస్.
నల్గొండ – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, హరిచందన దాసరి ఐఏఎస్.
ఆదిలాబాద్ – జూపల్లి కృష్ణారావు, కె.ఇలంబర్తి ఐఏఎస్.
వరంగల్ – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ ఆదిత్య ఐఏఎస్.
మహబూబ్‌నగర్ – దామోదర రాజనర్సింహ, వి.పి.గౌతమ్ ఐఏఎస్.
ఖమ్మం – వాకిటి శ్రీహరి, అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్.