E-Paper
Advertisement

దొంగ పత్రాలతో ఆస్తి విడిపించడంలో ఇతడు దిట్ట.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

దొంగ పత్రాలతో ఆస్తి విడిపించడంలో ఇతడు దిట్ట.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?
Advertisement

Fake Documents: నకిలీ, కల్పిత పత్రాలు సృష్టిస్తూ ప్రభుత్వ అధికారులుగా అవతారమెత్తి అక్రమాలకు పాల్పడుతున్న నిందితుడిపై మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. కాకినాడకు చెందిన డాక్యుమెంట్‌ రైటర్‌ వీర వెంకట సత్యనారాయణ (38)పై ఈ నెల 27న పీడీ యాక్ట్‌ అమలు చేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

మీ సేవా కేంద్రంలో..

నిందితుడు గతంలో మీ సేవా కేంద్రంలో పనిచేస్తూ పత్రాల తయారీపై పరిజ్ఞానం సంపాదించాడు. అనంతరం రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పనిచేసే సమయంలో మహమ్మద్‌ జహీర్‌తో పరిచయం ఏర్పడింది. ఆస్తుల అక్రమ లావాదేవీలకు సహకరిస్తే భారీగా డబ్బులు ఇస్తామని ప్రలోభపెట్టి అతడిని నేర కార్యకలాపాల్లోకి దించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సహచరులతో కలిసి కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రభుత్వ అధికారుల రబ్బరు స్టాంపులు సమకూర్చుకుని నకిలీ పత్రాలు తయారు చేసేవాడు. ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ తాకట్టు పెట్టిన ఆస్తులను మోసపూరితంగా విడిపించేందుకు ప్రయత్నించేవాడు.

శాంతిభద్రతలకు విఘాతం..

Advertisement

ఈ క్రమంలో 2026 సంవత్సరంలో మల్కాజిగిరి, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుడి కార్యకలాపాలు ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని గుర్తించిన పోలీసులు పీడీ యాక్ట్‌ అమలుకు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ ఈ నెల 27న ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించడం, ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ప్రజలను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Also Read: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? చర్లపల్లి – శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు ఇవే!

Tags

Related News

ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌గా పరిచయం.. టెకీకి రూ. 10.05 లక్షల టోకరా!

కల్వకుంట్ల కవిత చుట్టూ బ్రోకర్లు చేరారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన షకీల్!

ఇన్వెస్ట్‌ తెలంగాణ సమ్మిట్‌–2026లో కీలక మార్పులు.. 10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం!

ఎల్‌నినో ముప్పుకు చెక్.. తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్ల మెగా ప్లాన్ ఇదే!

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలను నీటి పంపులో తోసేసిన తల్లి!

గుజరాత్ మోడల్‌ను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు.. తెలంగాణ మోడల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఓయాసిస్ ఫెర్టిలిటీ కేసులో బిగ్ బ్లాస్ట్.. డైరెక్టర్, ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అరెస్ట్!

Big Stories

Advertisement
×