E-Paper
Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌గా పరిచయం.. టెకీకి రూ. 10.05 లక్షల టోకరా!

ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్‌గా పరిచయం.. టెకీకి రూ. 10.05 లక్షల టోకరా!
Advertisement

Instagram Marriage Fraud: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి మాటలు నమ్మి, ఏకంగా రూ.10.05 లక్షలు పోగొట్టుకుంది హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. పైగా ఈ మోసంలో నిందితుడికి అతని తల్లి కూడా తోడవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

నకిలీ ప్రొఫైల్‌తో పెళ్లి నాటకం

Advertisement

హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి ఇన్‌స్టాగ్రామ్‌లో జాజుల గునవంత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఒక గిటారిస్ట్, మోడల్ ఫోటోలతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించాడు. తాను ఒక డాక్టర్‌నని ఆమెను నమ్మించాడు. మాటలు కలిశాక పెళ్లి చేసుకుంటానని ఆశ చూపాడు. నిందితుడి తల్లి పటూరి సురేఖ కూడా రంగంలోకి దిగింది. ఈ పెళ్లి సంబంధం నిజమేనని ఆ యువతిని పూర్తిగా నమ్మించింది.

అత్యవసరమంటూ డబ్బు, బంగారం వసూలు

Advertisement

యువతి తనను పూర్తిగా నమ్మిందని నిర్ధారించుకున్నాక గునవంత్ అసలు కథ మొదలుపెట్టాడు. కుటుంబంలో తీవ్రమైన అత్యవసర పరిస్థితులు ఉన్నాయంటూ దఫదఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా, రాపిడో కొరియర్ ద్వారా బంగారు ఆభరణాలు పంపాలని ఆమెపై ఒత్తిడి తెచ్చి తెప్పించుకున్నాడు. చివరికి ఆమె హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా రూ.2.16 లక్షల రుణం తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.10.05 లక్షల మేర మోసగించాడు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు

తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు, ప్రధాన నిందితుడు గునవంత్‌తో పాటు అతనికి సహకరించిన తల్లి సురేఖను అరెస్ట్ చేశారు. సురేఖకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితుడు బంజారాహిల్స్‌లోని ‘గుప్తా ఆర్ట్స్ అండ్ జ్యువెలర్స్’ లో తాకట్టు పెట్టిన 20 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల హెచ్చరిక..

దర్యాప్తులో గునవంత్ పాత నేరస్థుడని, గతంలోనూ రూ.20 లక్షల మ్యాట్రిమోనియల్ మోసం కేసులో నిందితుడిగా ఉన్నాడని తేలింది. ప్రస్తుతం ఈ కేసులో పరారీలో ఉన్న గునవంత్ బంధువు బొరుగుంట లోకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆన్‌లైన్ పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ఎల్‌నినో ముప్పుకు చెక్.. తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్ల మెగా ప్లాన్ ఇదే!

Tags

Related News

కల్వకుంట్ల కవిత చుట్టూ బ్రోకర్లు చేరారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన షకీల్!

ఇన్వెస్ట్‌ తెలంగాణ సమ్మిట్‌–2026లో కీలక మార్పులు.. 10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం!

ఎల్‌నినో ముప్పుకు చెక్.. తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్ల మెగా ప్లాన్ ఇదే!

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలను నీటి పంపులో తోసేసిన తల్లి!

గుజరాత్ మోడల్‌ను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు.. తెలంగాణ మోడల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఓయాసిస్ ఫెర్టిలిటీ కేసులో బిగ్ బ్లాస్ట్.. డైరెక్టర్, ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అరెస్ట్!

డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్ డబుల్ గేమ్.. కేసీఆర్‌ను ఉతికారేసిన అద్దంకి!

Big Stories

Advertisement
×