Balapur Ganesh Idol: కేవలం మూడు వారాలు ఉండడంతో వినాయకుడి చవితి కోసం మండపాలు రెడీ అవుతున్నాయి. ఈసారి విగ్రహాలతోపాటు మండపాలు వెరైటీగా రూపు దిద్దుకుంటున్నాయి. అన్నింటికంటే ముందుగా చెప్పుకోదగినది బాలాపూర్ వినాయకుడు. ఈసారి స్వర్ణగిరి దేవాలయం తరహాలో గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వినాయక చవితికి సమయం దగ్గరపడుతోంది. కేవలం మూడు వారాలు మాత్రమే ఉంది. వినాయకుడి విగ్రహాల్లో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఈసారి చాలా ప్రాంతాల్లో వెరైటీగా తయారు చేస్తున్నారు. ఇక మండపాలు గురించి చెప్పనక్కర్లేదు. ప్రతీ ఏడాది మండపాల నమూనాను మారుస్తున్నారు నిర్వాహకులు.
ఖైరతాబాద్ గణేష్ తర్వాత బాలాపూర్ వినాయకుడి విగ్రహం గురించి ప్రధానంగా చెప్పుకుంటారు. ఈసారి స్వర్ణగిరి ఆలయం నమూనా మండపంలో బాలాపూర్ వినాయకుడు భక్తులకు దర్శనమీయ నున్నాడు. మండప సెట్టింగ్‌లోనూ బాలాపూర్ గణనాథుడు తనకంటూ ఓ ప్రత్యేకత చాటుతున్నాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి దేవాలయం నమూనాలో కొలువు దీరనున్నాడు. దీనికి సంబంధించిన పనులను శామీర్‌పేటకు చెందిన కళాకారులు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గతేడాది అయోధ్య రామ మందిరం తరహాలో మండపాన్ని తీర్చిదిద్దారు.
ALSO READ: వామ్మో.. ఇది హైటెక్ సిటీ కాదు.. ట్రాఫిక్ టార్చర్ సిటీ
ఈసారి స్వర్ణగిరి దేవాలయం తరహాలో భక్తులకు ఆకట్టుకోనున్నాడు లంబోదరుడు. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలన చేస్తున్నారు నిర్వాహకులు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ. 30 లక్షలు వెళ్లిన సంగతి తెల్సిందే. స్వర్ణగిరి దేవాలయం ఎందుకంట ఫేమస్?
భువనగిరి పట్టణ శివారులో స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం భాగ్యనగరం వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అక్కడికి అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మితగా ఆధ్యాత్మిక మందిరాలు ఆకట్టుకుంటున్నాయి.