BigTV English

Rajinikanth: అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్న రజినీకాంత్.. స్నేహితుడే అంటూ!

Rajinikanth: అవమానంతో కన్నీళ్లు పెట్టుకున్న రజినీకాంత్.. స్నేహితుడే అంటూ!

Rajinikanth:ఈరోజు ఫ్రెండ్షిప్ డే కావడంతో ప్రతి ఒక్కరూ తమ స్నేహితులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమ మధ్య ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ సంతోష పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తన స్నేహితుడే తనను అవమానించి, కళ్ళు తెరిపించాడు అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి అసలు ఏం జరిగిందో.. స్నేహితుడి కారణంగా రజనీకాంత్ ఎందుకు అవమానపడ్డారు? స్నేహితుడు అవమానంతో కళ్ళు తెరుచుకోవడం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


కూలీ తో సంచలనం సృష్టించబోతున్న రజినీకాంత్.

సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రజినీకాంత్ (Rajinikanth). ఏడు పదుల వయసులో కూడా వరుస యాక్షన్ సినిమాలు ప్రకటిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఇప్పుడు లోకేష్ కనగరాజు(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో పలువురు స్టార్ హీరోలు భాగమవడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా నుండి ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ విడుదల చేయగా.. ఈ సినిమాను ఆగస్టు 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు రజినీకాంత్ కు సంబంధించిన పలు ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


అవమాన భారంతో కన్నీళ్లు పెట్టుకున్న రజినీకాంత్..

రజినీకాంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన గతాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా ఒకానొక సమయంలో కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ..” ఒక వ్యక్తి నన్ను తన లగేజ్ ను టెంపో వరకు తీసుకు వెళ్ళమని అడిగాడు. ఆ తర్వాతే అతడు నా కాలేజ్ స్నేహితుడని గుర్తించాను. లగేజ్ మోసినందుకు రెండు రూపాయలు ఇచ్చి.. గతంలో నాకు ఉన్న అహంకారం గురించి విమర్శించాడు. ఆ మాటలకు నాకు కన్నీళ్లు ఆగలేదు ” అంటూ రజనీకాంత్ బాధపడ్డారు. ఇక గతంలో తాను ఎంత అహంకార భావంతో మెలిగానో తన స్నేహితుడు తనకు కళ్లకు కట్టినట్టు చూపించారు అని, ఆ తర్వాత ఎప్పుడు కూడా అలాంటి స్వభావాన్ని ప్రదర్శించలేదు అంటూ తెలిపారు రజినీకాంత్. ఇక ప్రస్తుతం రజనీకాంత్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రజనీకాంత్ సినిమాలు..

ప్రస్తుతం కూలీ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన రజినీకాంత్.. మరొకవైపు ‘జైలర్ 2’ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. 2023లో వచ్చి సెన్సేషన్ గా నిలిచిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్ జె సూర్య, మీర్నా మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో శివరాజ్ కుమార్(Siva Raj Kumar), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalhanidhi maran) నిర్మిస్తూ ఉండగా.. ఆర్ నిర్మల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రానికి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తూ ఉండడం గమనార్హం.

ALSO READ:Vijay Deverakonda: కింగ్ డం తర్వాత రౌడీ హీరో లైనప్ మామూలుగా లేదుగా.. అందరూ బడా డైరెక్టర్లే!

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×