BigTV English

BJP News: బండి డైలాగ్ బాంబ్.. బీజేపీలో బిగ్ బ్యాంగ్..

BJP News: బండి డైలాగ్ బాంబ్.. బీజేపీలో బిగ్ బ్యాంగ్..
Bandi Sanjay latest speech

Bandi Sanjay latest speech(Political news today telangana): అధ్యక్షుడిగా బండి సంజయ్ మస్త్ పని చేశారు. అయినా, ఆయన్ను ఎందుకు తీసేశారు? సింపుల్, బండి గ్రూపులు కడుతున్నారని.. అందరినీ కలుపుకొని పోవడం లేదని.. అన్నీ సొంత నిర్ణయాలే తీసుకుంటున్నారని.. ఇలా రకరకాలుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు కొందరు నేతలు. బండి సంజయ్ ఎంత బాగా పని చేసినా.. నేతలు ఇలా గ్రూపులుగా విడిపోవడం సరికాదని భావించిన హైకమాండ్.. వెంటనే బండి మీద వేటు వేసింది. అత్యంత సౌమ్యుడైన కిషన్‌రెడ్డికి పార్టీకి కిరీటం కట్టబెట్టింది. మంచి ముహూర్తం చూసుకుని.. శుక్రవారం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు కిషన్‌రెడ్డి. ఆ కార్యక్రమంలోనే.. అదును చూసి.. తన అక్కసు అంతా వెళ్లగక్కారు మాజీ అధ్యక్షులు.


ఢిల్లీ వెళ్లి కంప్లైంట్‌లు చేయడం మానేయండి.. తప్పుడు రిపోర్టులు ఇవ్వడం బంద్ చేయండి.. కిషన్‌‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేయనివ్వండి.. అంటూ సొంత పార్టీలోని ప్రత్యర్థులకు పంచ్‌లిచ్చారు బండి సంజయ్. ఆయన మాటలు కొందరికి గట్టిగానే తగిలి ఉంటాయి.

ఇక, ఇదే మీటింగ్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటలు మరింత ఆసక్తిగా సాగాయి. బండి సంజయ్‌ని చూసి తనకు కళ్లలో నీళ్లు తిరిగాయని.. పట్టలేక బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేశానని భావోద్వేగంతో మాట్లాడారాయన. తెలంగాణలో బీజేపీకి జోష్ వచ్చిందంటే అందుకు బండి సంజయ్ మాత్రమే కారణమని అన్నారు. కిషన్‌రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పని చేస్తానని చెప్పారు కోమటిరెడ్డి.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×