BigTV English

Viveka Murder Case: షర్మిల సాక్ష్యం.. అవినాశ్‌ను ఇరికించేశారా?

Viveka Murder Case: షర్మిల సాక్ష్యం.. అవినాశ్‌ను ఇరికించేశారా?
Viveka case latest updates

Viveka case latest updates(AP breaking news today) : వివేకా మర్డర్ కేసులో మళ్లీ అప్‌డేట్స్ వస్తున్నాయ్. సీబీఐ ఛార్జ్‌షీట్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగా.. గతంలో షర్మిల ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.


వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. వైఎస్‌ షర్మిలను 259వ సాక్షిగా కోర్టుకు వాంగ్మూలం సమర్పించింది సీబీఐ. గత అక్టోబర్‌ 7న ఢిల్లీలో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు షర్మిల. తన దగ్గర ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కారణాలతోనే బాబాయ్ హత్య జరిగిందని తెలిపారు. హత్యకు.. కుటుంబ, ఆర్థిక అంశాలు కారణాలు కాకపోవచ్చని.. మరో పెద్ద కారణమే ఉందని షర్మిల సీబీఐకి చెప్పినట్టు తాజాగా తెలిసింది. సాక్షిగా షర్మిల చెప్పిన విషయం.. పరోక్షంగా అవినాశ్‌రెడ్డినే టార్గెట్ చేశాయని అంటున్నారు.

మరోవైరు, ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రియాక్ట్ అయ్యారు. అబ్బాయే బాబాయ్‌ని చంపేశాడని.. అది జగనాసుర రక్త చరిత్ర అని షర్మిల కూడా తేల్చేశారని ట్వీట్ చేశారు. బాబాయ్‌ని చంపింది తన అన్నే కావొచ్చని షర్మిల వాంగ్మూలం ఇచ్చారని.. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల చెప్పారని అన్నారు. అవినాశ్ కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడటమే కారణమని షర్మిల వాంగ్మూలం ఇచ్చారని లోకేశ్ ట్వీట్‌లో ప్రస్తావించారు.


Related News

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Big Stories

×