Bandi Sanjay: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుందుబి మోగిస్తుందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐరెన్ లెగ్ పార్టీ అని రుజువి అయ్యిందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర ఎసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండిసంజయ్ కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బిజేపీ ఒంటరిగా 125 స్థానాలు.. యూపిలో ఏడు స్థానాలలో ముందంజలో ఉందని.. గతంలో కంటే ఎక్కువ సీట్లను తమ పార్టీ కైసవం చేసుకుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమికే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని తెలిపారు కేంద్రమంత్రి బండిసంజయ్. మహారాష్ట్రలో హిందూ సమాజం ఐకమత్యాన్ని చాటారన్నారు. వాస్తవ విషయాలు గ్రహించారు కాబట్టే.. కాంగ్రెస్ కూటమి ఓటమి చెందిందని విమర్శించారు. సమాజం ఐక్యంగా ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయన్నారు. కర్ణాటక, తెలంగాణ నుండి మహారాష్ట్రకి కాంగ్రెస్ డబ్బులు పంపిందని కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్రలో గెలుపుకి కారణమన్నారు.
Also Read: పల్టీలు కొట్టిన కారు వాళ్ళు తిరిగి రారు
మహారాష్ట్రలో మరోసారి మోడీ అభివృద్ధి మంత్రం పనిచేసిందన్నారు. ఇండియా కూటమి చీలిపోవడం ఖాయం అని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కి ఇదే గతి పడుతుందని వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలని తాము ప్రచారం చేసాం అన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవేర్చండి.. లేదంటే మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుందని కామెంట్స్ చేశారు.
జార్ఖండ్‌లో కాంగ్రెస్ పార్టీ ట్యాంపరింగ్ చేశారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణలో ప్రభావం చూపుతుందని.. యుద్ధం ప్రారంభం అయ్యిందని హెచ్చరించారు. మహారాష్ట్ర ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అవుతాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన దగ్గరే కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.