Drinks For Belly Fat: ప్రస్తుతం అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ పెరగడం వల్ల శరీర సౌందర్యం తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. ఊబకాయం అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. అందుకే వీలైనంత త్వరగా పెరిగిన బరువును తగ్గించుకోవడం మంచిది. ఇదిలా ఉంటే కొన్ని రకాల డ్రింక్స్ చలికాలంలో ఊబకాయాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మరి ఎలాంటి డ్రింక్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం , పుదీనా డ్రింక్:
తయారుచేసే విధానం: ఒక గ్లాసు నీళ్లలో చిన్న అల్లం ముక్క , కొన్ని పుదీనా ఆకులను వేసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. మీరు ఈ నీటిని రోజుకు 2 సార్లు త్రాగవచ్చు.
ప్రయోజనాలు: అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జీవక్రియను పెంచుతుంది. పుదీనా కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాకుండా గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
గ్రీన్ టీ, నిమ్మకాయ డ్రింక్:
తయారుచేసే విధానం: ఒక కప్పు వేడి గ్రీన్ టీలో నిమ్మరసం పిండుకుని తాగాలి.
ప్రయోజనాలు: గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వును తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
జీరా వాటర్:
తయారుచేసే విధానం: ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల జీలకర్ర వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి.
ప్రయోజనాలు: జీరా నీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా జీవక్రియను పెంచుతుంది. ఇది శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు ఈ డ్రింక్ త్రాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మెంతి డ్రింక్ :
తయారుచేసే విధానం: ఒక చెంచా మెంతి గింజలను రాత్రంతా గ్లాస్ నీటిలో నానబెట్టండి. ఈ నీటిని వడపోసి ఉదయాన్నే తాగాలి.
ప్రయోజనాలు: మెంతి గింజలు ఫైబర్ కలిగి ఉంటాయి. ఇది మీకు ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క , ఏలకుల టీ:
తయారుచేసే విధానం: ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క ముక్క, రెండు-మూడు ఏలకులు వేసి మరిగించాలి. మీకు కావాలంటే, మీరు దీనికి కొద్దిగా తేనెను కూడా కలుపుకోవచ్చు.
ప్రయోజనాలు: దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఏలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులోని గ్యాస్‌ను తగ్గిస్తుంది.
Also Read: చలికాలంలో ఈ ఒక్క డ్రింక్ త్రాగితే.. వ్యాధులు రమ్మన్నా రావు
ఇవే కాకుండా సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా బరువు తగ్గుతారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి ఈ డ్రింక్స్ త్రాగడం మంచిది.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.