E-Paper
Advertisement

Barrelakka : జనసేన.. తమ్మినేని.. బర్రెలక్కే బెటర్..

Barrelakka : జనసేన.. తమ్మినేని.. బర్రెలక్కే బెటర్..
Advertisement

Barrelakka : బర్రెలక్క.. ఈ పేరు సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తెలంగాణ ఎన్నికల బరిలో ఆమె దిగడం హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు తెలియని ఓటరు ఉండరంటే అతిశయోక్తికాదేమో.

కొల్లాపూర్ లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు ప్రచారంలో గట్టిపోటీ ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క ఓడిపోయినా.. ఊహించిన దాని కంటే ఎక్కువ ఓట్లే సాధించారు. కొల్లాపూర్ లో జాతీయ పార్టీ బీఎస్పీ కంటే ఆమె ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.

Advertisement

తెలంగాణలో 7 చోట్ల జనసేన అభ్యర్థుల కంటే బర్రెలక్కకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయనకు తాజా ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కేవలం 5,308 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ్మినేని వీరభద్రం కంటే కూడా బర్రెలక్క ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.

కొల్లాపూర్‌లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు- 5,754

Advertisement

కొత్తగూడెంలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు : 1,945
నాగర్ కర్నూల్‌లో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు : 1,955
కోదాడలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు : 2,151
అశ్వారావుపేటలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు : 2,281
వైరాలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు : 2,712
ఖమ్మంలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు : 4,040
తాండూరులో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు : 4,087

సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు పాలేరులో వచ్చిన ఓట్లు : 5,308 ఓట్లు

హాయ్ ఫ్రెండ్స్‌.. బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్‌.. అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయిన శిరీష తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంతో మరింత పాపులారిటీ సాధించారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నానని చెప్పిన బర్రెలక్కకు… పెద్ద ఎత్తున మద్దతు లభించింది. విజిల్‌ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన బర్రెలక్కకు మొత్తం 5,754 ఓట్లు వచ్చాయి. అయితే డిపాజిట్ రాలేదు. కానీ చాలా ప్రధాన పార్టీల కంటే ఆమె ఎక్కువ ఓట్లు సాధించారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×