E-Paper
Advertisement

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. బాసర క్షేత్రానికి నూతన వైభవం, రూ. 225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం!

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన.. బాసర క్షేత్రానికి నూతన వైభవం, రూ. 225 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం!
Advertisement

Basara Temple Renovation Master Plan: దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన, ఏకైక జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసర పునర్నిర్మాణంతో నూతన శోభను సంతరించుకోబోతోంది. వేల ఏళ్ల నాటి ఘన చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 225 కోట్లను కేటాయించింది. ఈ చారిత్రాత్మక పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం, ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ క్షేత్రాన్ని సకల సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు.

ఆలయ పునర్నిర్మాణం కోసం అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించి, వారి అనుమతులు, సూచనల మేరకు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజగోపురం, మాడ వీధులు, కోనేరు నిర్మాణాలలో ఆగమ శాస్త్ర నియమాలను పాటించనున్నారు.

Advertisement

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ విస్తీర్ణాన్ని భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల భారీ రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలను నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ 33 అడుగుల వెడల్పుతో విశాలమైన మాడ వీధులు ఏర్పాటు కానున్నాయి. మొత్తం ఆలయ విస్తీర్ణం 20 వేల నుండి 62 వేల చదరపు అడుగులకు పెరగనుంది. ఒకేసారి 6 వేల మంది భక్తులు వేచి ఉండేలా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యూ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో ఫీడింగ్ రూమ్స్, ఫుడ్ స్టాల్స్, మరుగుదొడ్లు వంటి వసతులు ఉంటాయి.

కురుక్షేత్ర యుద్ధం తర్వాత మనశ్శాంతి కోసం వేద వ్యాస మహర్షి పవిత్ర గోదావరి తీరానికి చేరుకుని బాసరలో నివసించారు. స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల మూర్తులను ఇక్కడ ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతోంది. అందుకే బాసర ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ఈ క్షేత్రం దేశవ్యాప్తంగా పెట్టింది పేరు. వసంత పంచమి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీని తట్టుకునేలా ఇప్పుడు ఆలయ విస్తరణ పనులు చేపట్టారు.

Advertisement

Read Also: రూ. 7,000 కోట్ల భూ కుంభకోణం? ప్రభుత్వ భూమిని మింగేస్తున్న మంత్రి ఫ్యామిలీ.. బీఆర్ఎస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Related News

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

Big Stories

Advertisement
×