E-Paper
Advertisement

వంద కోట్ల రాబరీ… పెట్రోల్ కోసం పీకలు కోస్తూ… గుండె బద్దలయ్యే థ్రిల్లర్

వంద కోట్ల రాబరీ… పెట్రోల్ కోసం పీకలు కోస్తూ… గుండె బద్దలయ్యే థ్రిల్లర్
Advertisement

Thriller Movie OTT : థియేటర్లలో కంటే ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలోనే కొన్ని సినిమాలకు ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలకు అలాంటి గుర్తింపు వస్తే మేకర్స్ ఆనందానికి హద్దులు అయితే ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. దీనికి థియేటర్లలో అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 90 నిమిషాలు మాత్రమే. ఎక్కడా సాగదీత లేకుండా చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. దీనికి ఐయండిబిలో 6.9/10 రేటింగ్ కూడా ఉంది. డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారని, ఆ ఆశే అందరినీ ఎలా నాశనం చేస్తుందనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లాస్ట్ స్టాప్ ఇన్ యుమా కౌంటీ’ (The Last Stop in Yuma County). 2023లో వచ్చిన ఈ అమెరికన్ సినిమాకు ఫ్రాన్సిస్ గల్లుప్పి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫ్రాన్సిస్ గల్లుప్పికి మొదటి సినిమా. ఈ సినిమా తీయడం కోసం ఆయన తన సొంత ఇంటిని కూడా అమ్ముకున్నారట. అంతేకాదు దీని మేకింగ్ స్టైల్ చూసి ముగ్ధుడైన ప్రముఖ హారర్ దర్శకుడు సామ్ రైమీ, తన నెక్స్ట్ మూవీ ‘ఈవిల్ డెడ్’ (Evil Dead)ను  డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఇక ఇందులో జిమ్ కమ్మింగ్స్, జోసెలిన్ డోనాహ్యూ, రిచర్డ్ బ్రేక్, ఫైజోన్ లవ్, మైఖేల్ అబాట్ జూనియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బుచియాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. అలాగే ‘కాల్గరీ అండర్ గ్రౌండ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో కూడా జ్యూరీ అవార్డును దక్కించుకుంది. ప్రస్తుతం Prime Video ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక కత్తులు అమ్ముకునే సేల్స్‌మెన్ తన కారులో ప్రయాణిస్తూ, ఎడారిలో ఉన్న ఒక చిన్న గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగుతాడు. అక్కడ పెట్రోల్ అయిపోయిందని, ట్యాంకర్ వచ్చే వరకు అక్కడ ఆగాల్సివస్తుంది. సరిగ్గా అదే టైమ్‌కి ఇద్దరు గూండాలు ఒక బ్యాంకును దోచుకుని, భారీగా నగదుతో అక్కడికి వస్తారు. బయట ఎండ దంచికొడుతుండటంతో, వేరే దారి లేక ఆ సేల్స్‌మెన్, ఆ దొంగలు మరికొంతమంది కలిసి ఒక చిన్న హోటల్‌లో కూర్చోవాల్సి వస్తుంది. ఆ హోటల్‌లో ఉన్నవాళ్లందరికీ ఆ ఇద్దరు పక్కా దొంగలని అర్థమైపోతుంది. కానీ వాళ్ల దగ్గర గన్ ఉండటంతో ఎవరూ నోరు మెదపలేరు. కాసేపటికి అక్కడ ఉన్నవాళ్లలో కొందరికి ఆ దొంగల దగ్గర ఉన్న డబ్బు మీద కన్ను పడుతుంది. ఎలాగైనా ఆ డబ్బు కొట్టేయాలనే అత్యాశ మొదలవుతుంది.

అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ హోటల్, ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. ఎవరు ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలియని ఉత్కంఠ నెలకొంటుంది. చివరికి ఆ పెట్రోల్ ట్యాంకర్ రానే వస్తుంది, కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఆ ఒక్క హోటల్ గదిలో మొదలైన గొడవ కాస్తా రక్తపాతానికి దారితీస్తుంది. చివర్లో ఊహించని మలుపులతో కథ ముగుస్తుంది. ఆ మలుపులు ఏమిటి ? అసలు అక్కడ ఏమి జరుగుతుంది ? ఆ డబ్బు ఎవరికి దక్కుతుంది ? అసలు ఎవరైనా ప్రాణాలతో మిగలతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ఇక్కడ చంపకపోతే, చావు తలుపు తడుతుంది… సస్పెన్స్ తో మెంటలెక్కించే థ్రిల్లర్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×