BigTV English

IIIT Student Suicide : బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాదం.. హాస్టల్ గదిలో విద్యార్థిని సూసైడ్

IIIT Student Suicide : బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాదం.. హాస్టల్ గదిలో విద్యార్థిని సూసైడ్
Student Suicide in Basara IIIT

Student Suicide in Basara IIIT(Telangana news updates): బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన తెనుగు శిరీష(18) పీయూసీ ఫస్టియర్‌ చదువుతుంది. బుధవారం తన ఇంటి నుంచి వర్సిటీకి వచ్చిన శిరీష.. గురువారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


అది గమనించిన హాస్టల్‌ సిబ్బంది క్యాంపస్‌ హెల్త్‌సెంటర్‌కి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు వైద్యులు. శిరీష మృతదేహాన్ని నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు క్యాంపస్‌ వర్గాలు చెబుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు శిరీష గదిని, మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకుని, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

Read More : సాయన్న కుమార్తె, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి


శిరీష రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా.. ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తుంది. తనకు బావ అయిన ఆకాష్.. ఇటీవలే సూసైడ్ చేసుకున్నట్లు శిరీష సూసైడ్ లేఖలో పేర్కొంది. అతని చావుకి కారణం ఎవరో తెలుసుకుని కఠిన శిక్షపడేలా చూడాలని తల్లిదండ్రులను కోరింది. “నేను ఇలా చేయడం తప్పని తెలుసు. మీరు బాధపడతారని తెలుసు. కానీ బావ లేని జీవితం నాకెప్పటికీ శూన్యమే. అందుకే నేను తన దగ్గరికి వెళ్లిపోతున్నా. బావ చనిపోయాక చివరిసారి కూడా చూడలేదు. అందుకే నన్నూ బావని దహనం చేసిన చోటే కాల్చండి. ఇదే నా చివరికోరిక. ప్లీజ్ నాన్న. నాకు నువ్వు, అమ్మ ఎంతో.. బావ కూడా అంతే నాన్న. తమ్ముడిని బాగా చూసుకో. అమ్మ జాగ్రత్త.” అని శిరీష సూసైడ్ నోట్ లో రాసుకొచ్చింది.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×