Telangana Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ మొదలైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ సంఘాల నేతలు, పార్టీల లీడర్లు నిరసనలు తెలుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది.
ఆర్టీసీ బస్ డీపో ముందు జోగు రామన్న ధర్నా..
ఆర్టీసీ బస్ డీపో ముందు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు వెళ్లకుండా డిపో ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు ఎందుకు మోడీపై ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల నిరసన..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డీపో ముందు బీసీ సంఘాల నేతలు నిరసన చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఆందోళన చేస్తున్నారు.
42 శాతం రిజర్వేషన్ కోటా కోసం పోరుబాట
ఖమ్మంలోని బస్ డీపో ముందు కాంగ్రెస్, అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఆస్తి కోసం 3 రోజులుగా తల్లికి అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. ఛీ, వీళ్లు మనుషులేనా?
బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఆందోళన..
మరోపక్క మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటు పెట్రోల్ బంక్‌లు కూడా పూర్తిగా మూసి వేస్తున్నారు. దీంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. మరో వైపు బీజేపీ సైతం ఈ బంద్‌లో పాల్గొంటోంది. దీనిపై భిన్న వాదనలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర పెండింగ్ లేకుండా చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై కమలనాథులు చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు, ఇతర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీలు, కుల సంఘాలు, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ సహకారాన్ని ఇవ్వడంతో బంద్ సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.