BC Bandh: బీసీ రిజర్వేషన్ల కోసం నేడు రాష్ట్రవ్యాప్త బంద్ జరిగింది. ఈ బంద్‌ను ‘బంద్ ఫర్ జస్టిస్’గా పిలుస్తూ, తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో 135 బీసీ అసోసియేషన్లు, 35 బీసీ సంస్థలు చేపట్టాయి. ఈ బంద్ లక్ష్యం లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేలను ఎత్తివేసి చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు..
అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ బంద్‌లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తాలో మానవ హారం ఏర్పాటు చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. కవిత, తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా బీసీల హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఆమె బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
కవిత తన ప్రకటనలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. “ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలో ఆ పార్టీలు కూడా బీసీ బంద్ లో పాల్గొనడం నవ్వులాటగా అనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కూడా బంద్ పాల్గొనడం దారుణం. బీసీ బిడ్డలను మభ్య పెట్టొద్దు, మోసం చేయొద్దు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకూ పోరాటం ఆగదు” అని అన్నారు. మరో ప్రకటనలో, “దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ పార్టీలు బంద్ కు మద్దతు తెలపడం అంటే హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉంది. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తది” అని వ్యాఖ్యానించారు. ఆమె ప్రకారం, తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను కేంద్రం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టింది, కాంగ్రెస్ ఉత్తుత్తి జీవో ఇచ్చి కేంద్రంతో పోరాడలేదు.
ఈ బంద్‌కు అన్ని ప్రధాన పార్టీలు – కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం – మద్దతు తెలిపాయి. అయితే, కవిత ఈ పార్టీల హిపోక్రసీని ఎత్తి చూపారు. బంద్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుంది.. హైదరాబాద్‌లో బస్ డిపోల వద్ద నిరసనలు, బస్సులు నిలిచిపోయాయి; స్కూల్స్, కాలేజీలు, బిజినెస్ ఎస్టాబ్లిష్‌మెంట్లు మూసి వేశారు.. మెడికల్, ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం మినహాయించారు. జిల్లాల్లో కూడా బస్ సర్వీసులు స్తంభించాయి, రోడ్లు ఖాళీగా కనిపించాయి.
Also Read: గరీబ్‌రథ్ రైలులో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..
అలాగే తల్లికి మద్దతుగా కొడుకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.. కల్వకుంట్ల కవిత పెద్ద కుమారుడు ఆదిత్య ఈ మానవ హారంలో చురుకుగా పాల్గొన్నాడు. అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆదిత్య, తెలంగాణ జాగృతి యువ విభాగంలో చురుకుగా ఉంటూ, తల్లి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాడు. హారంలో మాట్లాడుతూ, “బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే” అని స్పష్టం చేశాడు. ఇది కేవలం హక్కుల డిమాండ్ కాదు, సామాజిక న్యాయం కోసం అని ఒక్కొక్క్కరు చెప్పాడు. మరింత ఆసక్తికరంగా, “కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు. ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు వచ్చి పోరాడాలి” అని యువతను పిలుపునిచ్చాడు. ఆదిత్య మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, యువతలో ఉత్సాహాన్ని మేల్కొల్పాయి.
బీసీ బంద్ లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత..
ఖైరతాబాద్ చౌరస్తాలో బంద్ లో పాల్గొన్న కవిత
ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలో ఆ పార్టీలు కూడా బీసీ బంద్ లో పాల్గొనడం నవ్వులాటగా అనిపిస్తోంది
బీజేపీ, కాంగ్రెస్ కూడా బంద్ పాల్గొనడం దారుణం
బీసీ బిడ్డలను మభ్య పెట్టొద్దు, మోసం… pic.twitter.com/EYwalBjG8k
— BIG TV Breaking News (@bigtvtelugu) October 18, 2025
బీసీ బంద్ లో కవిత కొడుకు..
బిసి సంఘాల బంద్ పిలుపులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ఖైరతాబాదు చౌరస్తాలో జరిగిన మానవ హారంలో పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు ప్రతి… pic.twitter.com/c2wg6ZvnRN
— BIG TV Breaking News (@bigtvtelugu) October 18, 2025