Gundeninda GudiGantalu Today episode October 18th: నిన్నటి ఎపిసోడ్ లో..ప్రభావతి సత్యం వచ్చేలోగా ముగ్గురు తమ భార్యలను ఎత్తుకొని హాల్లో నడుస్తూ ఉంటారు. అది చూసిన ప్రభావతి సత్యంని అడుగుతుంది. నిన్నెత్తుకుంటే నేను హాస్పిటల్లో ఉంటాను అని సత్యం అంటాడు. అయినా మీ భార్యని ఎత్తుకోవడమేంటి దించండి ఏమి మీనా నువ్వు రోజురోజుకు చిన్నపిల్లలనుకుంటున్నావా? అని మీనా అని అంటుంది. నీ కళ్ళకి మిగతా ఇద్దరు కనిపించలేదు నేను ఒక్కదాని మాత్రమే మీకు కనిపిస్తున్నానన్నమాట.. నన్నే అంటారే అని మీనా ప్రభావతిని అడుగుతుంది. అవునండి మీరు ఎందుకు మీనానే టార్గెట్ చేస్తున్నారు అని శృతి అడుగుతుంది. ఈ ఐడియా ఎవరిది అని ప్రభావతి అడుగుతుంది. అందరికన్నా ముందు ఈ ఐడియా ఇచ్చింది నేనే ఇప్పుడు తప్ప ఏమైందంటే అని శృతి కడిగి పడేస్తుంది. ఇలాంటివి ఏవైనా ఉంటే మీ గదిలో పెట్టుకోవాలని చెప్పాను కదా అమ్మ అందరినీ ఇలా చేస్తే ఎలా అని ప్రభావతి అడుగుతుంది. గది గురించి మళ్లీ గొడవ జరగడంతో సత్యం కీలక నిర్ణయం తీసుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మనోజ్ మీనా కుటుంబాన్ని దారుణంగా అవమానిస్తాడు. కనీసం 1000 రూపాయలు కూడా ఇవ్వలేరు అంటూ దారుణంగా అవమానించి మాట్లాడుతారు.. మనోజ్ నీ బాలు కొడతాడు. మీనా గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని బాలు మనోజ్ నీ కొడతాడు.. మీనా వదినను ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని రవి కూడా అంటాడు. వీళ్ళ ముగ్గురు కొట్టుకోవడం వరకు వెళ్తారు. రోహిణి మాత్రం మీనాకు కావాలని ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. మేము కష్టపడి సంపాదించి ఇస్తున్నాము. నువ్వు మావయ్య గారి దగ్గర మంచి పేరు కొట్టడానికి ఇంట్లోకి సరుకులు తెస్తున్నానని చెప్తున్నావా అని రోహిణి అడుగుతుంది.
మంచి పేరు తెచ్చుకోవడమేంటి ఏం మాట్లాడుతున్నావ్ రోహిణి అని మీనా అంటుంది. మీనా మావయ్య గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడమేంటి? ఆల్రెడీ మామయ్య గారికి మీనా అంటే చాలా ఇష్టం ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని శృతి అంటుంది. ఆమెప్పుని ఇంకాస్త పెంచుకునేందుకే నువ్వు డబ్బులు ఇస్తాను అంటున్నావా? పూలమ్మితే ఎంత డబ్బులు మిగులుతాయి ఏంటి అని రోహిణి మీనాను అవమానించేలా మాట్లాడుతుంది. ఎంత డబ్బులు మిగులుతాయి కాదు మనము ఇంటికి సమానంగా ఎంత ఇస్తున్నాము అన్నదే ఇక్కడ పాయింట్ అని శృతి అంటుంది.
అది కాదు రోహిణి నువ్వు అత్తయ్యకు 5000 పాకెట్ మనీ ఇచ్చావు. మలేషియా నుంచి వచ్చిన డబ్బులతో చీర కొనిచ్చావు ఇదంతా నువ్వు అత్తయ్యని బుట్టలో వేసుకోవాలనే కదా అని శృతి దిమ్మదిరిగి పోయేలా అడుగుతుంది.. నేనెక్కడి నుంచి ఇస్తానని కాదు నువ్వు ఇంటిని పెద్ద కోడలుగా ఏమాత్రం చక్కదిద్దుతున్నావు అన్నదే ఇక్కడ పాయింట్ అని శృతి అంటుంది. నేను పది వేలు ఇస్తానన్నాను ఇంటికి పెద్ద కోడలు వి నువ్వు 5000 ఇస్తానన్నావు. అందరికన్నా ఎక్కువ నువ్వే ఇచ్చి ఈ ఇంటిని చక్కదిద్దాల్సిన బాధ్యత మీదే కదా అని శృతి అంటుంది. రోహిణిని మీనా శృతి ఇద్దరు ఓ ఆట ఆడుకుంటారు.
ఇక రోహిణి చేసేదేమీ లేక అక్కడినుంచి వెళ్ళిపోతుంది. బాలు పైనుంచి చిరాగ్గా కిందకి వస్తాడు. మీనా నాకు అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టివ్వు అని అడుగుతాడు. మీరేంటి అంత చిరాగ్గా ఉన్నారు ఏమైంది అని అడుగుతుంది మీనా. ఆ మనోజ్ గాడు ఏదేదో మాట్లాడుతున్నాడు వాడే ఇంటిని ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. అందుకే నాలుగు తగిలించి వచ్చాను నాకు అర్జెంటుగా స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అని మీనా తో సీరియస్గా అంటాడు.. నువ్వేంటి అలా ఉన్నావు నీకేమైంది అని మీనాని బాలు అడుగుతాడు. ఆయన గారి భార్య ఇక్కడికి వచ్చి ఆమె ఇంటిని ఉద్ధరిస్తున్నట్లు.. అంత డబ్బులు మీరెలా ఇస్తారు అన్నట్లు మాట్లాడుతుంది.
Also Read : ‘ఇంటింటి రామాయణం ‘ కమల్ రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్..?
రోహిణి అన్నది కూడా నిజమే కదా మనం అంత డబ్బులు ఎలా తెచ్చి ఇస్తాము అని అంటుంది. మీనా మాట వినగానే నువ్వే నా ఈ మాట మాట్లాడుతున్నావు. మనకేమీ చేతకాదా కష్టపడుతున్నాం కదా మనమే డబ్బులు అందరికన్నా ముందు ఇస్తాం అని బాలు అంటాడు. మనల్ని చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు మనం ఇవ్వడం ఎందుకండీ అని బాలతో అంటుంది మీనా.. నువ్వు ఇంకేం మాట్లాడకు నాన్న ఎప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగాడు అంటే కచ్చితంగా ఏదో ఒక కారణమే ఉంటుంది అని బాలు అంటాడు. మీరు ఎంత చెప్పినా వినరు కదా అని మీనా అంటుంది. ఈ తలనొప్పి తగ్గాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి అని బాలు అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతాయి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..