OTT Movie : లవ్ స్టోరీలు చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ విచిత్రంగా నడుస్తుంటుంది. ఈ జంట ఎప్పుడు గొడవలు పడుతూ, విడిపోతూ ఉంటారు. అయితే విడిచి ఉండలేక మళ్ళీ కలుస్తుంటారు. అసలు వీళ్ళ సమస్య ఏమిటనేదే మెయిన్ పాయింట్. ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. అయితే బో*ల్డ్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. ఒంటరిగా ఈ సినిమాను చూడటం మంచిది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘After Ever Happy’ 2022లో వచ్చిన అమెరికన్ రొమాంటిక్ సినిమా. కాస్టిల్ లాండన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జోసెఫిన్ లాంగ్‌ఫోర్డ్, ఫియన్స్ టిఫిన్, స్కార్లెట్ లార్సెన్, చాన్స్ పెర్డోమో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 సెప్టెంబర్ 7న అమెరికాలో విడుదల అయింది. ఇది 2015లో అన్నా టాడ్ నవల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
టెస్సా అనే ఒక కాలేజ్ స్టూడెంట్, హార్డిన్ అనే వ్యక్తితో తో ప్రేమలో ఉంటుంది. వాళ్ల ప్రేమ ఎప్పుడూ గొడవలు పడి విడిపోవడం, మళ్లీ కలవడం మధ్య గందరగోళంగా సాగుతుంది. ఇది ఇలా ఉండగా హార్డిన్ తన తల్లి పెళ్లికి లండన్ వెళ్తాడు. అక్కడ అతని మానసిక సమస్యలు మరింత పెరుగుతాయి. టెస్సా హార్డిన్‌ను కలసి వాళ్ల ప్రేమను ఒక దారిలో పెట్టాలని ప్రయత్నిస్తుంది. కానీ హార్డిన్ మానసిక సమస్యలు వల్ల ఆమెను దూరం చేస్తాడు. ఈ సమయంలో టెస్సా తన ఫ్యామిలీ రహస్యాలు కూడా తెలుసుకుంటుంది. అది ఆమెను మరింత బాధపెడుతుంది.
Read Also : ఆకాశంలో విహారయాత్ర… పైప్రాణాలు పైకే పోయే ఆపద… తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్