E-Paper
Advertisement

BC Jathara: బీసీ జన జాగరణ జాతరను విజయవంతం చేయాలి : మాస్ వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు

BC Jathara: బీసీ జన జాగరణ జాతరను విజయవంతం చేయాలి :  మాస్ వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు
Advertisement

BC Jathara: ఏప్రిల్ 19వ తేదీన నిర్వహించే బీసీ జన జాగరణ జాతర కార్యక్రమాని విజయవంతం చేయాలని మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాక అధ్యక్షులు కటికం నర్సింగ్ రావు పిలుపునిచ్చారు. జన జాగరణ కార్యక్రమంపై నాగోల్ లోని మాస్ కార్యాలయంలో శనివారం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై నర్సింగ్ రావు మాట్లాడుతూ… అగ్రవర్గాలకు వ్యతిరేకం కాదు… బీసీల ఐక్యత, ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేస్తున్నామని అన్నారు. పార్టీ సిద్ధాంతాలతో పనిలేకుండా ఆర్ఎస్ఎస్ నుంచి రాడికల్ భావజాలమున్న బీసీలందరూ హక్కుల రక్షణకు ఒక్కటి కావాల్సిందేనని అన్నారు. ఏ పార్టీకి అనుబంధంగా, ఏ వ్యక్తులకు అనుకూలంగా ఉండబొమని స్పష్టం చేశారు.

Also Read: Gaddar Film 2025 Awards: గద్దర్ ఫిలిం అవార్డ్స్.. శ్రేయ ఘోషల్..సుమ కనకాల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఆలోచనకు అనుగుణంగానే ముందుకు

Advertisement

కేవలం మన ఆలోచనకు అనుగుణంగానే ముందుకు సాగుతుంది మాస్ అని అన్నారు. బీసీలల్లో వెనుకబడిన వర్గాలు ముందుకొచ్చి మాస్ ఆలోచన అందిపుచ్చుకోవాలని అన్నారు. బీసీలోని అన్ని కులాలు అత్యధికంగా పాల్గొని అక్కడ ప్రదర్శించే వస్తువులను తిలకించాలన్నారు. బీసీలకు అత్యంత గౌరవమైన కుల వృత్తులను ప్రదర్శించి ప్రాధాన్యత వివరిస్తామని వివరించారు. ఆట, పాట, మాట తో నే ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని తెలిపారు.

వేలాదిమంది బీసీ ఇంటెలెక్ట్యువల్స్

ఈ బీసీ జన జాగరణ జాతర కార్యక్రమానికి వేలాదిమంది బీసీ ఇంటెలెక్ట్యువల్స్, మేధావులు, జర్నలిస్టులు ఉద్యమకారులు, విద్యావంతులు, కవులు, రచయితలు, బీసీ యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉన్నందున ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామాలలో పట్టణాలలో మండలాలలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న బీసీ నాయకులు పాల్గొని జన జాగరణ జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు గడ్డం నరసింహ గౌడ్, పూస నర్సింహా, ఉపాధ్యక్షులు కోల భాస్కర్, ఆవుల వెంకట్ యాదవ్, మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర, పోల్కం బాల నారాయణ మాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిలు కొంపోజు నరహరి చారి, పెదవూర బ్రహ్మయ్య, దువ్వల శ్రీకాంత్ గంగపుత్ర, కోరంగి దుర్గారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Airlines Warning: ప్రభుత్వానికే వార్నింగ్ ఇస్తున్న ఎయిర్ లైన్స్ సంస్థలు.. ముదిరిన సీట్ సెలక్షన్ లొల్లి!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×