BigTV English

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka latest news(Political news in telangana): రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే డబల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ప్రతి శాసన సభ నియోజకవర్గ పరిధిలో 3500 ఇళ్ల చొనప్పున రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇచ్చిన హామీల అమలుకు పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు.


ఆదిలాబాద్ జిల్లా బజూర్ హత్నూర్ మండలం పిప్రిలో భట్టి బుధవారం పర్యటించారు. పిప్రిలో రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన తన పాద యాత్ర ప్రధాన కారణం అని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనకబడిన ప్రాంతం కాదని, రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే అగ్రగామిగా నిలిపే బాధ్యత తమపై ఉందని అన్నారు


Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×