E-Paper
Advertisement

500 కాదు 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు! కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్!

500 కాదు 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు! కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

Aadi Srinivas: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వస్తామని కేటీఆర్ కంటున్నవన్నీ కేవలం పగటి కలలేనని ఆయన విమర్శించారు.

5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు

Advertisement

రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ కేటీఆర్ చేస్తున్న ప్రచారాన్ని ఆది శ్రీనివాస్ కొట్టిపారేశారు. 500 రోజులు కాదు కదా.. 5000 రోజులు గడిచినా కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. అధికారం కోసమే ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్‌ది జీరో పెర్ఫామెన్స్

Advertisement

2023 డిసెంబర్‌లో అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ కేవలం ఫార్మ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసకరంగా పరిపాలించిందని ఆయన పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పనితీరు పూర్తిగా జీరోగా ఉందన్నారు. ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్‌ను అంతం చేయడం ఎవరి తరం కాదు

కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అంతం చేయాలని గతంలో కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయన వల్లే కాలేదని, ఇప్పుడు కేటీఆర్ వల్ల ఏమవుతుందని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది, వారికి ఎల్లప్పుడూ అండగా నిలిచేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా పగటి కలలు మానుకుని వాస్తవంలోకి రావాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.

Also Read: ప్రేమ అంటే ఇదేరా భయ్! యూకే అమ్మాయిని తెలుగు ఇంటి కోడలిగా తెచ్చుకున్న ఖమ్మం కుర్రాడు!

Tags

Related News

ప్రేమ అంటే ఇదేరా భయ్! యూకే అమ్మాయిని తెలుగు ఇంటి కోడలిగా తెచ్చుకున్న ఖమ్మం కుర్రాడు!

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయి.. బిజెపి అంటేనే వాటికి భయం: బండి సంజయ్

తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు పర్యటనకు వస్తున్నారు?- కోమటి రెడ్డి

మాట నిలబెట్టుకున్న రేవంత్.. 214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల రివార్డులు!

3 ఏళ్లలో అన్యాయం జ‌రిగింది.. రాజ‌గోపాల్ రెడ్డి ఇష్యూపై ఉత్త‌మ్ రియాక్ష‌న్‌!

అర్ధరాత్రి కాల్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య!

స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం

Big Stories

Advertisement
×