E-Paper
Advertisement

తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు పర్యటనకు వస్తున్నారు?- కోమటి రెడ్డి

తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు పర్యటనకు వస్తున్నారు?- కోమటి రెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy: హైదరాబాద్ గాంధీ భవన్‌లో పార్టీ ఇంచార్జ్ సందీప్ కుమార్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వన్ టూ వన్ సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, బీజేపీ నేతల పర్యటనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కార్యకర్తలకు పదవులు.. 100 సీట్ల గెలుపే లక్ష్యం

Advertisement

ఇంచార్జ్ సందీప్ కుమార్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారని కోమటిరెడ్డి చెప్పారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న సీనియర్ నేతలు, కార్యకర్తలను గుర్తించి వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని తాను కోరినట్లు తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ అందరి ఏకైక లక్ష్యమని ఇంచార్జ్ స్పష్టం చేసినట్లు వివరించారు. పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేదని, జిల్లా పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపై ఈ భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలవడం ఖాయమని మంత్రి అన్నారు.

బీజేపీ పర్యటనపై ప్రశ్నలు

Advertisement

బీజేపీ నేతలు నడ్డా, నితిన్ నవీన్‌లు తెలంగాణ పర్యటనపై మంత్రి విమర్శలు గుప్పించారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తరపున వారేం చేశారని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ వైఖరిని ఆయన తప్పుబట్టారు.

ఓట్ల తొలగింపుపై ఆగ్రహం

రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు అంశంపై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరి ఓట్లు పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై స్పందిస్తూ.. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే జీవితాంతం అనుభవించాల్సి ఉంటుందని అడ్వకేట్ చెప్పినట్లు మంత్రి వెల్లడించారు.

Also Read: మాట నిలబెట్టుకున్న రేవంత్.. 214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల రివార్డులు!

Tags

Related News

మాట నిలబెట్టుకున్న రేవంత్.. 214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల రివార్డులు!

3 ఏళ్లలో అన్యాయం జ‌రిగింది.. రాజ‌గోపాల్ రెడ్డి ఇష్యూపై ఉత్త‌మ్ రియాక్ష‌న్‌!

అర్ధరాత్రి కాల్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య!

స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ కొనసాగిన ఐటీ సోదాలు.. రూ.5 కోట్ల నగదు స్వాధీనం

నేడు కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. పూర్తి షెడ్యూల్ ఇదే?

ఇంటర్ బోర్డు రద్దు పై భగ్గుమంటున్న బీఆర్ఎస్.. అసలు కారణం అదేనా..?

మరో సారీ సత్తాచాటిన తెలంగాణ పోలీస్‌ బృందం.. ఏంచేసారంటే?

Big Stories

Advertisement
×