E-Paper
Advertisement

Kamareddy : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కామారెడ్డి కొదమసింహం ఎవరు?

Kamareddy : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కామారెడ్డి కొదమసింహం ఎవరు?
Advertisement

Kamareddy Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో 2,45,982 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,18,718 మంది ఉన్నారు. మహిళలు 1,27,080 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ గంప గోవర్థన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (27-08-2023)

Advertisement

బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ కి 65 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే 25 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. ఇక్కడ బీజేపీకి 10 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (03-11-2023)..

Advertisement

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసీఆర్ కి 46 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి అనుముల రేవంత్ రెడ్డికి 47 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. బీజేపీకి 7 శాతం మాత్రమే ఓట్లు వస్తున్నాయి.

సర్వేల్లో భారీ మార్పు..

రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ కు, బీజేపీకి కూడా ఓట్ల శాతం తగ్గుతుంది. కాంగ్రెస్ కు మాత్రం ఓట్ల శాతం భారీగా పెరిగింది. బీఆర్ఎస్ కు 19 శాతం ఓట్లు తగ్గుతుండగా.. కాంగ్రెస్ కు ఏకంగా 22 శాతం ఓట్లు పెరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఓటర్లు బీజేపీ వైపు ఆసక్తి కనబరచడం లేదు.

కామారెడ్డి నియోజకవర్గంలో బిగ్ ఫైట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గులాబీ బాస్‌ కేసీఆర్‌ను పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నేరుగా ఢీ కొట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ ఓటమి భయంతోనే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లగలిగేలా చేశామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అలాగే మైనార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు కేసీఆర్ పాల్పడుతున్నారనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. మరోవైపు కేసీఆర్‌ సైతం తాను కామారెడ్డిలో గేలిచినా గజ్వేల్ నియోజకవర్గం నుంచే కొనసాగుతానని ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గజ్వేల్‌లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని అక్కడి ఓటర్లు భగ్గుమంటున్నారు. ఈ పరిణామాలతో పాటు కొడంగల్‌లో తనపై పోటీ చేయాలంటూ ఇటీవల రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కి సవాల్‌ విసిరారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రేవంత్‌రెడ్డి నేరుగా కేసీఆర్‌ను ఢీ కొట్టనున్నారు. హైకమాండ్‌ ఆదేశాలు రావడమే తరువాయి రంగంలోకి దిగనున్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ మధ్య పోటీ జరిగితే ఓటర్ల స్పందనపై బిగ్ టీవీ సర్వే చేసింది. కేసీఆర్‌కు 46 శాతం ఓట్లు వస్తుండగా .. రేవంత్‌రెడ్డికి 47 శాతం ఓట్ షేర్‌ దక్కనుంది. ఇది నవంబర్‌ 3 నాటికే ప్రజల అభిప్రాయం. ఇక రేవంత్‌రెడ్డి పోటీ కన్ఫామ్‌ చేసి గ్రౌండ్‌లోకి దిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోయే చాన్సెస్‌ ఉన్నాయి. ఇప్పటికిప్పుడైతే కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డిదే పైచేయిగా ఉండనుంది.

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×